నరసరావుపేట రూరల్: క్రమశిక్షణతో ఉద్యోగ బాధ్యతలు నిర్వహించాలని జిల్లా ఎస్పీ జగదీష్ అదహళ్లి తెలిపారు. విజయనగరం పోలీసు అకాడమిలో శిక్షణ పూర్తిచేసుకుని ఉమ్మడి గుంటూరు జిల్లాకు కేటాయించిన 80 మంది మహిళా కానిస్టేబుల్స్ సోమవారం జిల్లా పోలీసు కార్యాలయానికి వచ్చారు. వీరికి కొన్ని రోజుల పాటు స్థానిక పోలీసు స్టేషన్లలో శిక్షణ ఇవ్వనున్నారు. నూతనంగా పోలీసు శాఖలో చేరిన మహిళ కానిస్టేబుల్స్‌తో మాట్లాడారు. క్రమశిక్షణతో ఉద్యోగ బాధ్యతలు నిర్వహించి పోలీసు శాఖకు పేరు తీసుకురావాలని సూచించారు. పోలీసు స్టేషన్‌లో ఉద్యోగ బాధ్యతలపై పూర్తి అవగాహన పెంపొందించుకోవాలని సూచించారు. కార్యక్రమంలో ఏఆర్ డీఎస్పీ మహాత్మాగాంధీ రెడ్డి, ఏఆర్ ఆర్‌ఐ కృష్ణ పాల్గొన్నారు.
జిల్లా ఎస్పీ జగదీష్ అదహళ్లి


