పల్నాడు గడ్డపై పుట్టిన మాల కన్నమదాసు వారుసులం ఎప్పటికీ వైఎస్ జగన్‌మోహన్ రెడ్డికి అండగా నిలబడతాం వైఎస్సార్‌సీపీ రాష్ట్ర ఎస్సీ సెల్ అధ్యక్షుడు టీజేఆర్ సుధాకర్‌బాబు
ఆ సంగతి మరిచిపోవద్దు
ప్రైవేట్ పంచాయితీలు చేస్తున్న సీఐను సస్పెండ్ చేయాలి
పిడుగురాళ్ల: వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులను ఎన్ని వేధింపులకు గురి చేసినా తట్టుకునే శక్తి తమలో ఉందని, అక్రమ కేసులు, వేధింపులకు భయపడే ప్రసక్తే లేదని పార్టీ రాష్ట్ర ఎస్సీ సెల్ అధ్యక్షుడు టీజేఆర్ సుధాకర్‌బాబు స్పష్టం చేశారు. పల్నాడు జిల్లా పిడుగురాళ్ల పట్టణ వైఎస్సార్ సీపీ ఎస్సీ సెల్ అధ్యక్షుడు జడ సురేంద్రను శుక్రవారం ఆయన పరామర్శించారు. ఆయనకు ధైర్యం చెప్పారు. పార్టీ అండగా ఉంటుందని, అధైర్యపడవద్దని కుటుంబ సభ్యులకు భరోసా ఇచ్చారు. ఈ సందర్భంగా విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ... మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు గురజాల మాజీ ఎమ్మెల్యే కాసు మహేష్‌రెడ్డిల విజ్ఞప్తి మేరకు వచ్చానని తెలిపారు. సురేంద్ర విషయంలో జరిగిన సంఘటనను తీవ్రంగా ఖండిస్తున్నట్లు పేర్కొన్నారు. 2021లో ఇద్దరు వ్యక్తుల మధ్య జరిగిన వ్యాపారంలో సురేంద్ర రూ. 30 లక్షలతో ఖలీల్ రెస్టారెంట్‌ను కొనుగోలు చేశారు. వ్యాపారం సజావుగా సాగాక ప్రభుత్వం మారడంతో వెంటనే పిడుగురాళ్ల పట్టణ సీఐ వెంకట్రావును అడ్డుపెట్టుకొని చంద్రబాబు సామాజిక వర్గానికి చెందిన టీడీపీ నాయకుడు ఖలీల్ రెస్టారెంట్‌ను చేజిక్కించుకోవాలని సురేంద్రపై గంజాయి కేసుపెడతాను, రేప్ కేసు పెడతానని వేధించారని ఆరోపించారు. అక్రమంగా రూ. 30 లక్షలను సురేంద్ర నుంచి పోలీస్ ేస్టేషన్ వద్ద ఉన్న అరుగు మీద వసూలు చేయడం దుర్మార్గం అన్నారు. అందుకు సంబంధించిన వీడియో తమ దగ్గర ఉందని ఆయన తెలిపారు. సీఐ శ్రీరాం వెంకట్రావు వేధింపులు తట్టుకోలేక ఆత్మహత్యయత్నం చేసిన దళిత నాయకుడు జడ సురేంద్రకు అండగా తామంతా ఉన్నామని పేర్కొన్నారు. దళితుడైన మందా సాల్మన్‌ను నరికి చంపిన సంఘటన మరిచిపోకముందే జడ సురేంద్రను మానసికంగా చంపే ప్రయత్నాన్ని టీడీపీ నాయకులు, పోలీసులు చేయటం దుర్మార్గమన్నారు. సీఐ వెంకట్రావు ప్రైవేటు సెటిల్‌మెంట్‌లు చేస్తున్న వీడియోలు తమ వద్ద ఉన్నాయని ఆరోపించారు. వాటిని ఎస్‌పీకి అందజేస్తామని, ఎస్పీ తగిన చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు.
పంతానికి పౌరుషానికి పురిటిగడ్డ అయిన పల్నాడు గడ్డ మీద పుట్టిన మాలకన్నమ్మదాసు వారుసులం తామని, ఆ సంగతి మరిచిపోవద్దని గుర్తు చేశారు. విజయవాడకు చెందిన గాదె సాయికృష్ణను లాకప్‌డెత్ చేశారని, ఇప్పటికీ మృతదేహం కనిపించని పరిస్థితి నెలకొందని పేర్కొన్నారు. మాదిగ సామాజిక వర్గానికి చెందిన పేరుపోగు క్రాంతికుమార్‌ను సీఐ నాగరాజు వేధించటంతో అన్యాయంగా మృతి చెందాడన్నారు. ఇంతటి దుర్మార్గపు పరిపాలన ఎక్కడైనా ఉంటుందా అని విమర్శించారు. వైఎస్సార్‌సీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్ రెడ్డికి ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలు అండగా నిలబడినందుకే అణగదొక్కేందుకు చంద్రబాబు ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు. అందుకు పోలీసులను అడ్డుపెట్టుకుంటున్నారని తెలిపారు. తమకు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డిపై ఉన్న నమ్మకాన్ని దెబ్బతీయలేరని పేర్కొన్నారు. కార్యక్రమంలో పట్టణ కన్వీనర్ మాదాల కిరణ్‌కుమార్, రాష్ట్ర ఎస్సీ సెల్ ప్రధాన కార్యదర్శి కన్నమాల శామ్యూల్, జిల్లా ఎస్సీ సెల్ కన్వీనర్ కొమ్ము చంద్రశేఖర్, జిల్లా ఎస్సీ సెల్ ఉపాధ్యక్షుడు కాలే మాణిక్యరావు, జిల్లా ప్రధాన కార్యదర్శులు చల్లగుండ్ల స్వామి, నేలటూరి సురేష్, పులిమళ్ల మాణిక్యరావు, ప్రమీణ్‌కుమార్, ఎస్సీ సెల్ నాయకులు గోసుల బుజ్జి, శ్యామ్, జి.నాగేశ్వరరావు, నోముల నర్సయ్య, దాసరి సునీల్‌కుమార్, శావల్యాపురం ఎస్సీ సెల్ అధ్యక్షుడు వినోద్, పట్టణ యూత్ కన్వీనర్ మందా సుధీర్, డేగల యోహాన్, కె.రత్నబాబు, రమణ, కందుకూరి మరియానందం, అందుగుల చరణ్, తాళ్లూరి సునీల్, ముద్దా ప్రేమ్‌కుమార్, ఏసుపొంగు శ్రీను, ముద్దా సుధాకర్, వైఎస్సార్‌సీపీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.


