కూటమి దుర్మార్గ పాలనకు పరాకాష్టే సునీల్‌ అరెస్టు | - | Sakshi
Sakshi News home page

కూటమి దుర్మార్గ పాలనకు పరాకాష్టే సునీల్‌ అరెస్టు

Jun 20 2026 5:52 AM | Updated on Jun 20 2026 5:52 AM

కారుమూరి సునీల్‌ అరెస్టును ఖండించిన వైఎస్సార్‌ సీపీ బీసీ నాయకులు

నరసరావుపేట: వైఎస్సార్‌సీపీ సీనియర్‌ నాయకుడు, మాజీ మంత్రి కారుమూరి నాగేశ్వరరావు కుమారుడు సునీల్‌ అక్రమ అరెస్టు కూటమి ప్రభుత్వ దుర్మార్గం, అరాచకానికి పరాకాష్ట అని పార్టీ బీసీ సెల్‌ నాయకులు పేర్కొన్నారు. శుక్రవారం సాయంత్రం జిల్లా పార్టీ కార్యాలయంలో నిర్వహించిన విలేకర్ల సమావేశంలో బీసీసెల్‌ జిల్లా అధ్యక్షులు సిద్దాడపు గాంధీ మాట్లాడారు. రాష్ట్రంలో ఎవరైతే ప్రభుత్వ అక్రమాల గురించి మాట్లాడతారో వారిపై ఈడీ కేసులు బనాయిస్తున్నారన్నారు. అందులో భాగమే సునీల్‌పై అక్రమ కేసుపెట్టి అరెస్టు చేశారన్నారు. కూటమి నాయకులకు విజయవాడలో కాపు యువకుడి లాకప్‌ డెత్‌ జరిగి నా, అక్కడి సీఐ బాధ తట్టుకోలేక దళిత యువకుడు ఆత్మహత్య చేసుకున్నా పట్టించుకునే సమయం లేదన్నారు. తునిలో ఓ బాలిక అదృశ్యమై 15రోజులు గడుస్తున్నా కనుగొనటంలో విఫలమయ్యారన్నారు. ముఖ్యంగా బీసీలపై దాడులు పెరిగిపోయాయని అన్నారు. బీసీలకు ఎస్‌సీ, ఎస్‌టీ, అట్రాసిటీ చట్టం వర్తింపచేయాల్సిన అవసరం కూటమి ప్రభుత్వంలో కన్పిస్తుందన్నారు. ఇటువంటి దుర్మార్గపు చర్యలు మానుకోకపోతే బీసీలు అందరూ ఐక్యమై తగిన గుణపాఠం చెబుతారని హెచ్చరించారు. బీసీ సెల్‌ జిల్లా ప్రధాన కార్యదర్శి అట్లూరి బాల సుబ్రమణ్యం మాట్లాడుతూ ఇప్పటికై నా ప్రభుత్వ పెద్దలు కళ్లు తెరిచి సుపరిపాలన సాగిస్తే వారికి మనుగడ ఉంటుందని, లేనిపక్షంలో బీసీలు అందరూ ఏకమై తగిన బుద్ధి చెబుతారని పేర్కొన్నారు. బీసీ నాయకులు బాదుగున్నల శ్రీనివాసరావు, వావిలాల విజయశ్రీ నివాస్‌, తోట వీ రయ్య పాల్గొన్నారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement