అవయవదానంతో ఐదుగురికి పునర్జన్మ | - | Sakshi
Sakshi News home page

అవయవదానంతో ఐదుగురికి పునర్జన్మ

Jun 18 2026 1:47 AM | Updated on Jun 18 2026 1:47 AM

అవయవదానంతో ఐదుగురికి పునర్జన్మ

గుంటూరు మెడికల్‌: విధి నిర్వహణలో బ్రెయిన్‌ స్ట్రోక్‌కు గురైన వ్యక్తి ఐదుగురికి నూతన జీవితాలను ప్రసాదించారు. ఆయన అవయవదానంతో ఐదు కుటుంబాల జీవితాల్లో వెలుగు నిండింది. ఎకై ్సజ్‌ శాఖలో సీనియర్‌ అసిస్టెంట్‌గా పనిచేస్తున్న పామర్తి నాగ వెంకట దుర్గ శ్రీనివాస్‌ (48) విధి నిర్వహణలో ఉన్న సమయంలో ఈ నెల 10న బ్రెయిన్‌ స్ట్రోక్‌కు గురయ్యారు. వెంటనే సహచర సిబ్బంది ఆయన్ను గుంటూరు ఆస్టర్‌ రమేష్‌ హాస్పిటల్‌కు తరలించారు. వైద్యులు ఆరు రోజులపాటు వైద్య చికిత్స అందించినా బ్రెయిన్‌ స్ట్రోక్‌తో ఆరోగ్య పరిస్థితి విషమించి ఈ నెల 16న బ్రెయిన్‌ డెడ్‌ అయినట్లు నిర్ధారించారు. ఆయన భార్య వెంకట నాగలక్ష్మి, తల్లి పి.వి.జయలక్ష్మి తదితర కుటుంబసభ్యులు దుఃఖంలో ఉండి కూడా అవయవదానానికి అంగీకరించారు. జీవన్‌దాన్‌ కో ఆర్డినేటర్లు అవగాహన కల్పించడంతో వారు ముందుకొచ్చారు. బుధవారం రెండు నేత్రాలను ఎల్‌.వి.ప్రసాద్‌ ఇనిస్టిట్యూట్‌కు, ఒక కిడ్నీఎన్నారై హాస్పిటల్‌కు తరలించారు. మరో కిడ్నీ, లివర్‌ను ఆస్టర్‌ రమేష్‌ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న వారికి అమర్చి నూతన జీవితాలు ప్రసాదించారు. ఆసుపత్రి మేనేజింగ్‌ డైరెక్టర్‌, సీనియర్‌ కార్డియాలజిస్ట్‌ డాక్టర్‌ పోతినేని రమేష్‌బాబు మాట్లాడుతూ అవయవదానం చేసిన కుటుంబ సభ్యులను అభినందించారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement