పల్నాడు | - | Sakshi
Sakshi News home page

పల్నాడు

Jun 17 2026 4:51 AM | Updated on Jun 17 2026 4:51 AM

బుధవారం శ్రీ 17 శ్రీ జూన్‌ శ్రీ 2026 సొంత భవనాల్లేక చింతలు

న్యూస్‌రీల్‌

జిల్లాలో పరిస్థితిదీ...

ముందుకు కదలని నిర్మాణాలు...

పులిచింతల సమాచారం

బుధవారం శ్రీ 17 శ్రీ జూన్‌ శ్రీ 2026
సొంత భవనాల్లేక చింతలు

అంగన్‌వాడీ కేంద్రాలకు సొంత భవనాలు నిర్మించడంలో చంద్రబాబు సర్కార్‌ తీవ్ర నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోంది. గర్భిణులు, బాలింతలు, పిల్లల బాగోగులు చూడాల్సిన అంగన్‌వాడీ కేంద్రాలకు సొంత భవనాలు కరువయ్యాయి. మౌలిక వసతులు లేక నిత్యం చిన్నారులకు ఇబ్బందులు తప్పడం లేదు. వారికోసం టీడీపీ ప్రభుత్వ పాలనలో కనీసం నిధులు కేటాయించడం, భవనాల నిర్మాణం చేపట్టడం లేదు.

సత్తెనపల్లి: చిన్నపిల్లలు, గర్భిణులు, బాలింతల కోసం పనిచేయాల్సిన అంగన్‌వాడీ కేంద్రాలు డీలా పడుతున్నాయి. చాలా కేంద్రాలకు సొంత భవనాలు లేవు. అద్దె భవనాలు, ఇరుకై న గదుల్లో నిర్వహించాల్సిన దుస్థితి నెలకొంది. జిల్లాలో 9 ఐసీడీఎస్‌ ప్రాజెక్టుల పరిధిలో చాలావరకు ఇదే పరిస్థితిని ఎదుర్కొంటున్నాయి. అద్దె భవనాల్లో మౌలిక వసతులు లేకపోవడంతో తీవ్ర ఇబ్బందులు పడాల్సి వస్తోంది. జిల్లాలో 2,301 అంగన్‌వాడీ కేంద్రాలుండగా... 571 కేంద్రాలకు మాత్రమే సొంత భవనాలు ఉన్నాయి. 1,065 కేంద్రాలు అద్దె భవనాల్లో నడుస్తున్నాయి. 395 కేంద్రాలు అద్దె చెల్లించాల్సిన పని లేకుండా ప్రభుత్వానికి చెందిన పాఠశాలలు, కమ్యూనిటీ హాల్స్‌లో కొనసాగుతున్నాయి. ఈ కేంద్రాల పరిధిలో మొత్తం 0–6 ఏళ్లలోపు చిన్నారులు 97,502 మంది, గర్భిణులు 9,548 మంది, బాలింతలు 9,414 మంది నిత్యం సేవలు అందుకుంటున్నారు. గత వైఎస్సార్‌ సీపీ ప్రభుత్వం కొత్త భవనాలు మంజూరుకు నిధులు కేటాయించేందుకు చర్యలు చేపట్టింది.

అంగన్‌వాడీ కేంద్రాల భవన నిర్మాణాలకు గత వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం నిధులు విడుదల చేసింది. వీటి పనులు ప్రారంభమైన కొంత కాలానికే ఎన్నికల నోటిఫికేషన్‌ రావడం, తర్వాత ఏర్పడిన టీడీపీ సర్కార్‌ వీటి గురించి కనీసం ఆలోచన కూడా చేయలేదు. దీంతో ఎక్కడ నిర్మాణాలు అక్కడే నిలిచిపోయాయి. తుది దశలో 56, శ్లాబ్‌ లెవల్‌లో 14, రూఫ్‌ స్థాయిలో 2, బేస్‌మెంట్‌ లెవల్‌లో 2 నిర్మాణాలు ఉన్నాయి. వీటి నిర్మాణాలను పూర్తి చేసేందుకు రూ 3.80 కోట్లు మంజూరు చేయాలని ఐసీడీఎస్‌ అధికారులు ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపారు. ఇంతవరకు నిధులు మంజూరు కాలేదు. ఇవే కాక జిల్లాలో శాటిలైట్‌ కేంద్రాలు 11, ఫౌండేషన్‌ కోలొకేటెడ్‌ కేంద్రాలు 2 భవనాలు నిర్మాణంలో ఉన్నాయి. ఇవి తుది దశకు చేరినప్పటికీ కేవలం తలుపులు, కిటికీలు, విద్యుత్‌ కనెక్షన్లు, మంచినీటి సదుపాయం వంటి చిన్న పనులను పూర్తి చేస్తే వాడుకలోకి వచ్చే అవకాశం ఉంది. అయినప్పటికీ ప్రభుత్వం నిర్లక్ష్యం వీడటం లేదు. ఉపాధి హామీ పథకం కింద 190 కేంద్రాల నిర్మాణాలకు నిధులు ఇవ్వాలని ఐసీడీఎస్‌ అధికారులు ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపారు. ఇంతవరకు అతీగతీ లేదు. కొన్ని కేంద్రాలకు అద్దె చెల్లిస్తున్నప్పటికీ మరుగుదొడ్లు, మంచినీటి సదుపాయాలు కూడా లేకుండా అధ్వానంగా ఉన్నాయి. కనీసం చాపలు లేకుండా పిల్లలు నేల మీద కూర్చునే పరిస్థితి చాలా కేంద్రాల్లో నెలకొంది. ఇప్పటికై నా సంబంధిత సీ్త్ర శిశు సంక్షేమ శాఖ ఉన్నతాధికారులు, పాలకులు దృష్టి సారించి అంగన్‌వాడీ కేంద్రాలకు పక్కా భవనాల నిర్మాణాలకు నిధులు కేటాయించి సకాలంలో పూర్తి చేయాలని అంగన్‌వాడీ కార్యకర్తలు, పిల్లల తల్లిదండ్రులు కోరుతున్నారు.

సొంత భవనాలకు

నోచుకోని అంగన్‌వాడీ కేంద్రాలు

భవనాలు మంజూరు చేసిన

గత వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం

చంద్రబాబు సర్కార్‌ వచ్చాక

పట్టించుకునే దిక్కే లేదు

నిత్యం నానా ఇబ్బందులు

పడుతున్న చిన్నారులు, మహిళలు

అచ్చంపేట: పులిచింతల ప్రాజెక్టులో ప్రస్తుత నిల్వ 33.0520 టీఎంసీలు. ఎగువ నుంచి 4,130 క్యూసెక్కులు వచ్చి చేరుతుండగా, దిగువకు 400 క్యూసెక్కులు వదలుతున్నారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement