జిల్లా అదనపు ఎస్పీ జేవీ సంతోష్ జిల్లా పోలీసు కార్యాలయంలో పీజీఆర్‌ఎస్
నరసరావుపేట రూరల్: పీజీఆర్‌ఎస్‌లో వచ్చే అర్జీలను వేగంగా పరిష్కరించాలని జిల్లా అదనపు ఎస్పీ జేవీ సంతోష్ తెలిపారు. జిల్లా పోలీసు కార్యాలయంలో సోమవారం పీజీఆర్‌ఎస్ నిర్వహించారు. జిల్లా అదనపు ఎస్పీ సంతోష్ ఫిర్యాదులు స్వీకరించారు. ఆర్థిక, కుటుంబ సమస్యలతోపాటు పలు మోసాలు, బెదిరింపులు, ఆక్రమణలకు సంబంధించిన 54 ఫిర్యాదులు కార్యక్రమంలో అందాయి. ఇందులో అధికంగా భార్యభర్తల వివాదాలపై 11, భూ వివాదాలపై 9, ఆర్థిక వివాదాలపై ఏడు ఫిర్యాదులు వచ్చాయి. పీజీఆర్‌ఎస్‌లో వచ్చిన మహిళలు, వృద్ధులకు సంబంధించిన ఫిర్యాదుల పట్ల ప్రత్యేక దృష్టి సారించి చట్టప్రకారం న్యాయం చేయాలని అధికారులను అదనపు ఎస్పీ ఆదేశించారు.


