వీఆర్‌ఏల డిమాండ్ల పరిష్కారానికి దశలవారీ పోరాటం | - | Sakshi
Sakshi News home page

వీఆర్‌ఏల డిమాండ్ల పరిష్కారానికి దశలవారీ పోరాటం

Mar 24 2026 8:01 AM | Updated on Mar 24 2026 8:01 AM

వీఆర్‌ఏల డిమాండ్ల పరిష్కారానికి దశలవారీ పోరాటం

వీఆర్‌ఏల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు బందగీ సాహెబ్‌ సత్తెనపల్లి ఇన్‌చార్జి ఆర్డీఓ శ్రీరాములుకు వినతిపత్రం అందజేత

సత్తెనపల్లి: వీఆర్‌ఏల న్యాయమైన డిమాండ్ల పరిష్కారానికి దశల వారీ పోరాటం తప్పదని వీఆర్‌ఏల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు షేక్‌ బందగీ సాహెబ్‌ అన్నారు. దీనిలో భాగంగా సోమవారం సత్తెనపల్లి ఇన్‌చార్జ్‌ ఆర్డీవో కె.శ్రీరాములును కలిసి వినతి పత్రం అందించారు. అనంతరం బందగీసాహెబ్‌ మాట్లాడుతూ ఈ నెల 26వ తేదీన ఉదయం 10 గంటలకు సత్తెనపల్లి ఆర్డీవో కార్యాలయం వద్ద రిలే నిరాహార దీక్ష చేపట్టడం జరుగుతుందన్నారు. వీఆర్‌ఏలకు పే స్కేలు, జీతాలు అమలు చేయాలన్నారు. వీఆర్వో, రికార్డ్‌ అసిస్టెంట్‌, అటెండర్‌, నైట్‌ వాచ్‌మన్‌ పోస్టులను వన్‌ టైం సెటిల్‌మెంట్‌ ద్వారా భర్తీ చేయాలన్నారు. నామినీలను వీఆర్‌ఏలుగా గుర్తించాలన్నారు. వీఆర్‌ఏలకు అక్రమ డ్యూటీలను రద్దు చేయాలన్నారు. ఈ నెల 26న జరగనున్న రిలే నిరాహార దీక్షకు జిల్లాలో ఉన్న అన్ని మండలాల వీఆర్‌ఏలు అందరూ తప్పనిసరిగా పాల్గొనాలన్నారు. అన్ని మండలాల నాయకులు మీ మండలంలో ఉన్న వీఆర్‌ఏల అందరూ తప్పనిసరిగా పాల్గొనే విధంగా కృషి చేయాలన్నారు. ప్రమోషన్‌, నామిని వీఆర్‌ఏలు అందరూ ఎక్కువ సంఖ్యలో పాల్గొన్నాలన్నారు. ఆర్డీవో శ్రీరాములు సానుకూలంగా స్పందించారన్నారు. కార్యక్రమంలో వీఆర్‌ఏల సంఘం సత్తెనపల్లి మండల అధ్యక్షుడు రవి, మండల ప్రధాన కార్యదర్శి మునాఫ్‌, ఉన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement