గురజాల : అక్రమ కేసులో అరెస్టయి బెయిల్‌పై విడుదల అయిన మాచర్ల మాజీ ఎమ్మెల్యే, పల్నాడు జిల్లా వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు పిన్నెల్లి రామకృష్ణారెడ్డిని సోమవారం మాజీ ఎమ్మెల్యే కాసు మహేష్‌రెడ్డి పరామర్శించారు. మాచర్లలోని పిన్నెల్లి నివాసంలో మాజీ ఎమ్మెల్యే కాసు మహేష్‌రెడ్డి పిన్నెల్లిని పరామర్శించారు. ఆయనతో పాటు వైఎస్సార్‌సీపీ రాష్ట్ర కార్యదర్శి , పెదకూరపాడు నియోజకవర్గ పరిశీలకుడు యెనుముల మురళీధర్‌రెడ్డి, మాచర్ల నియోజకవర్గ పరిశీలకుడు కొమ్మినేని వెంకటేశ్వర్లు (కేవి), గురజాల నియోజకవర్గ పరిశీలకుడు పడాల శివారెడ్డి, కొప్పుల సాంబయ్య, పిడుగురాళ్ల టౌన్ అధ్యక్షుడు మాదాల కిరఃణ్ కుమార్, మండల అధ్యక్షుడు చింతా సుబ్బారెడ్డి, మాజీ ఎంపీపీ అల్లు పిచ్చిరెడ్డి, వైఎస్సార్ సీపీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.
పీఆర్కేను కలిసిన గౌతమ్‌రెడ్డి
మాచర్ల: టీడీపీ ప్రభుత్వం వైఎస్సార్ సీపీ పల్నాడు జిల్లా అధ్యక్షుడు పిన్నెల్లి రామకృష్ణారెడ్డిపై ఆక్రమంగా హత్య కేసు బనాయించింది. ఈ కేసులో 99 రోజులపాటు జైలులో ఉండి బెయిల్‌పై విడుదలైన పీఆర్కే ను సోమవారం వైఎస్సార్‌సీపీ నరసరావుపేట పార్లమెంట్ పరిశీలకులు పూనూరు గౌతమ్‌రెడ్డి క్యాంపు కార్యాలయంలో కలిశారు. ఈ సందర్భంగా అక్రమ కేసుకు సంబంధించి వివరాలు అడిగి తెలుసుకున్నారు. టీడీపీ ప్రభుత్వం పెట్టే అక్రమ కేసులు నిలబడవన్నారు. ఈ సందర్భంగా పీఆర్కేను ఘనంగా సత్కరించారు. ఈయన వెంట గురజాల నియోజకవర్గ పరిశీలకులు శివారెడ్డి, నాయకులు, తదితరులు ఉన్నారు.
పీఆర్కేను కలిసిన డాక్టర్ గజ్జల..
సత్తెనపల్లి: వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షుడు పిన్నెల్లి రామకృష్ణారెడ్డి (పీఆర్కే) అక్రమ కేసులో బెయిల్ పై విడుదలై వచ్చిన సందర్భంగా ఆయనను కలిసేందుకు వైఎస్సార్ సీపీ సత్తెనపల్లి నియోజకవర్గ సమన్వయకర్త డాక్టర్ గజ్జల సుధీర్‌భార్గవ్‌రెడ్డి ఆధ్వర్యంలో నియోజకవర్గం నుంచి సోమవారం భారీ స్థాయిలో పార్టీ నాయకులు, కార్యకర్తలు మాచర్ల తరలి వెళ్లారు. మాచర్లలో పిన్నెల్లి రామకృష్ణారెడ్డిని మర్యాదపూర్వకంగా కలిశారు. నియోజకవర్గంలోని సత్తెనపల్లి పట్టణం, సత్తెనపల్లి రూరల్, ముప్పాళ్ళ, రాజుపాలెం, నకరికల్లు మండలాల నుంచి పెద్ద సంఖ్యలో తరలి వెళ్లారు.


