అనుగ్రహ పరిపూర్ణురాలు కానుకమాత | - | Sakshi
Sakshi News home page

అనుగ్రహ పరిపూర్ణురాలు కానుకమాత

Jan 25 2026 7:18 AM | Updated on Jan 25 2026 7:18 AM

అనుగ్

అనుగ్రహ పరిపూర్ణురాలు కానుకమాత

అనుగ్రహ పరిపూర్ణురాలు కానుకమాత ఉద్యోగుల సంఘం మహిళ విభాగం రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా హేమలత నేడు విద్యార్థులకు ఉపకార వేతనాల పంపిణీ

రెంటచింతల: పరిపూర్ణమైన హృదయంతో ప్రార్థించిన ప్రతి ఒక్కరిపై అనుగ్రహం కురిపించి వరాలిచ్చే తల్లి కానుకమాత అనుగ్రహ పరిపూర్ణురాలుగా కొనియాడబడుతుందని తాళ్లచెరువు విచారణ గురువులు రెవ.ఫాదర్‌ తుమ్మా మర్రెడ్డి అన్నారు. శనివారం సాయంత్రం 1850 సం.లో నిర్మించిన పురాతన కానుకమాత దేవాలయంపై జెండా ఆవిష్కరించారు. అనంతరం ప్రాంగణంలో చర్చి విచారణ గురువులు రె. ఫాదర్‌ వైఎల్‌ మర్రెడ్డి నేతృత్వంలో సిల్వర్‌ జూబిలేరియన్స్‌ సిల్వర్‌ జూబిలేరియన్స్‌ రెవ. ఫాదర్లు తుమ్మా మర్రెడ్డి, పుట్టి అంతోనిరాజు, చింతపల్లి అబ్రహాం, పోతిరెడ్డి ఇన్నారెడ్డి, సహాయ గురువులు ప్రసన్నకుమార్‌, రె.ఫాదర్‌ గోవిందుబాలస్వామిలతో కలిసి నవదిన ప్రార్థనలలో భాగంగా నిర్వహించిన ప్రత్యేక సమిష్టి దివ్య పూజాబలిని సమర్పించి ఆయన భక్తులను ఉద్దేశించి మాట్లాడారు. ఈ నవదిన ప్రార్థనలలో పాల్గొని కరుణమయురాలైన కానుకమాత దీవెనలు పొందాలని కోరారు. కథోలిక సంఘంలో ప్రతి ఒక్కరు ఏసు జీవితాన్ని ఆదర్శంగా తీసుకోవాలన్నారు.

నెహ్రూనగర్‌ (గుంటూరు ఈస్ట్‌) : ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వ ఉద్యోగుల సంఘం మహిళ విభాగం రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా గుంటూరు జీజీహెచ్‌లో స్టాఫ్‌నర్సుగా పనిచేస్తున్న పి.హేమలత ఏకగ్రీవంగా ఎన్నియ్యారు. విజయవాడలోని ఉద్యోగ సంఘం రాష్ట్ర కార్యాలయంలో రాష్ట్ర మహిళ విభాగానికి సంబంధించిన ఎన్నికలు శనివారం జరిగాయి. ఈ ఎన్నికల్లో గుంటూరు జిల్లాకు చెందిన ఎం.గాయత్రి కార్యనిర్వహణ కార్యదర్శిగా ఎన్నికయ్యారు. ఈసందర్భంగా నూతనంగా ఎన్నికై న రాష్ట్ర ప్రధాన కార్యదర్శి హేమలత మాట్లాడుతూ తనపై నమ్మకంతో రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా ఎన్నుకున్నందుకు రాష్ట్ర అధ్యక్షుడు సూర్యనారాయణకు ధన్యవాదాలు తెలిపారు.

కొరిటెపాడు(గుంటూరు): ‘కృష్ణదేవరాయ ఎయిడ్‌ ఫర్‌ ఫూర్‌ అండ్‌ అండర్‌ ప్రివిలేజ్డ్‌–గుంటూరు’, ‘కోపా–విసన్నపేట’ వారి సంయుక్త ఆధ్వర్యంలో ప్రతిభ పురస్కారాలలో భాగంగా చదువులో అత్యుత్తమ ప్రతిభ కనబరిచిన 247 మంది పేద విద్యార్థులకు రూ.9.50 లక్షల ఉపకార వేతనాలు పంపిణీ చేయనున్నట్లు తులసి గ్రూప్‌ మేనేజింగ్‌ డైరెక్టర్‌ తులసి యోగీష్‌ చంద్ర శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. ఇందులో రూ.4.33 లక్షలు తులసి సీడ్స్‌ వారు ‘కృష్ణదేవరాయ ఎయిడ్‌ ఫర్‌ ఫూర్‌ అండ్‌ అండర్‌ ప్రివిలేజ్డ్‌’ ద్వారా 114 మంది పేద విద్యార్థులకు అందిస్తున్నట్లు పేర్కొన్నారు. ఈ కార్యక్రమం ఎన్టీఆర్‌ జిల్లా, విసన్నపేట లోని వికాస్‌ డిగ్రీ కళాశాల ఆవరణలో ఆదివారం మధ్యాహ్నం 1 గంటకు ప్రారంభముతుందని వెల్లడించారు. ఈ కార్యక్రమానికి గౌరవ అతిథిగా తులసి గ్రూప్స్‌ చైర్మన్‌ తులసి రామచంద్ర ప్రభు హాజరై వితరణ చేయనున్నట్టు ఆయన వివరించారు.

ఫాదర్‌ తుమ్మా మర్రెడ్డి

అనుగ్రహ పరిపూర్ణురాలు కానుకమాత 1
1/1

అనుగ్రహ పరిపూర్ణురాలు కానుకమాత

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement