వైఎస్సార్‌సీపీ రాష్ట్ర విభాగంలో ఇద్దరు నియామకం
నరసరావుపేట: వైఎస్సార్‌సీపీ అధ్యక్షులు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఆదేశాల మేరకు పల్నాడు జిల్లాకు చెందిన ఇద్దరు నాయకులను పార్టీ రాష్ట్ర అనుబంధ విభాగాల్లో నియమిస్తూ కేంద్ర పార్టీ కార్యాలయం శుక్రవారం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ మేరకు మాచర్లకు చెందిన వేముల వెంకటేశ్వర్లును బీసీ సెల్ జోన్–3 వర్కింగ్ ప్రెసిడెంట్‌గాను, నరసరావుపేటకు చెందిన కొత్తూరి కిషోర్‌బాబును రాష్ట్ర వాణిజ్య విభాగ ప్రధాన కార్యదర్శిగా నియమించారు.
ఆర్టీసీలో ఐటీఐ అప్రెంటీస్‌కు
29న హాజరుకావాలి
నరసరావుపేట: ఆర్‌టీసీలో ఐటీఐ అప్రెంటీస్ షిప్ చేసేందుకు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసి ధృవపత్రాల పరిశీలన పూర్తయిన పల్నాడు జిల్లాకు చెందిన అభ్యర్థులు ఈనెల 29న విజయవాడ విద్యాధరపురం, చెరువుగట్టు సెంటర్‌లోని జోనల్ స్టాఫ్ ట్రైనింగ్ కళాశాల వద్దకు హాజరుకావాలని ట్రైనింగ్ కళాశాల ప్రిన్సిపాల్ పి.నీలిమ శుక్రవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఎంపిక జాబితాను apsrtc.ap.gov.in వెబ్‌సైట్‌లో రిక్రూట్‌మెంట్ ట్యాబ్ నందు పొందుపర్చామని పేర్కొన్నారు.


