వెబ్‌సైట్‌లో ఇంటర్ ప్రాక్టికల్ హాల్‌టికెట్లు
నరసరావుపేట ఈస్ట్: ఇంటర్మీడియెట్ ప్రాక్టికల్ పరీక్షలకు హాజరయ్యే విద్యార్థుల హాల్‌టికెట్లు శనివారం నుంచి అందుబాటులో ఉంటాయని జిల్లా ఇంటర్మీడియెట్ విద్యాశాఖాధికారి ఎం.నీలావతిదేవి శుక్రవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఈనెల 27వ తేదీ నుంచి ప్రాక్టికల్స్ ప్రారంభమవుతున్న దృష్ట్యా విద్యార్థులు తమ హాల్‌టికెట్స్‌ను bie.ap.gov.in వెబ్‌సైట్ నుంచి డౌన్‌లోడ్ చేసుకోవచ్చని వివరించారు. అలాగే మనమిత్ర వాట్సాప్ 95523 00009 నెంబర్ నుంచి పొందవచ్చని తెలిపారు. కళాశాలల యాజమాన్యాలు, విద్యార్థుల తల్లిదండ్రులు గమనించి హాల్‌టికెట్లు డౌన్‌లోడ్ చేసుకోవాలని కోరారు.
రైలు నుంచి జారిపడి గుర్తుతెలియని వ్యక్తి మృతి
నరసరావుపేట టౌన్: రైలు నుంచి ప్రమాదవశాత్తు జారిపడి గుర్తుతెలియని వ్యక్తి మృతి చెందినట్లు రైల్వే ఎస్‌ఐ ఎం.రాజమోహన్ శుక్రవారం తెలిపారు. గుండ్లకమ్మ రైల్వే స్టేషన్ సమీపంలో ప్రమాదవశాత్తు ఓ వ్యక్తి(30) రైలు నుంచి జారిపడి మృతి చెందాడు. మృతుడు తెలుపురంగు చొక్కా ధరించి ఉన్నాడు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం నరసరావుపేట ఏరియా వైద్యశాలకు తరలించారు. మృతుడి ఆనవాళ్లు తెలిసిన వారు రైల్వే పోలీస్ స్టేషన్‌లో సంప్రదించాలని ఎస్‌ఐ కోరారు.


