తిరుమలలో అన్నదానం చేసిన భాష్యం రామకృష్ణ | - | Sakshi
Sakshi News home page

తిరుమలలో అన్నదానం చేసిన భాష్యం రామకృష్ణ

Jan 24 2026 7:21 AM | Updated on Jan 24 2026 7:21 AM

తిరుమ

తిరుమలలో అన్నదానం చేసిన భాష్యం రామకృష్ణ

గుంటూరు ఎడ్యుకేషన్‌: తిరుమలలో శ్రీవేంకటేశ్వరస్వామివారి దర్శనానికి వచ్చే భక్తులకు అన్న ప్రసాదాన్ని వితరణ చేసేందుకు రూ.44 లక్షలు విరాళంగా అందజేసిన భాష్యం విద్యాసంస్థల చైర్మన్‌ భాష్యం రామకృష్ణ శుక్రవారం తిరుమలలోని శ్రీతరిగొండ వెంగమాంబ నిత్యాన్నదాన సత్రంలో భక్తులకు అన్నప్రసాద వితరణ కార్యక్రమంలో స్వయంగా పాల్గొన్నారు. భాష్యం రామకృష్ణతో పాటు భాష్యం విద్యాసంస్థల వైస్‌ చైర్మన్‌ భాష్యం హనుమంతరావు భక్తులకు అన్న ప్రసాదాన్ని వడ్డించారు. కార్యక్రమంలో టీటీడీ అదనపు ఈవో వెంకయ్య చౌదరి పాల్గొన్నారు.

గుంటూరులో సిగ్నేచర్‌

డైన్‌ రెస్టారెంట్‌ ప్రారంభం

నగరంపాలెం (గుంటూరు వెస్ట్‌): గుంటూరులో అన్నివర్గాల ప్రజలకు అందుబాటులో ఉండేలా సిగ్నేచర్‌ డైన్‌ రెస్టారెంట్‌–కన్వెన్షన్‌ నెలకొల్పడం అభినందనీయమని రాష్ట్ర ఇంధన శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్‌ అన్నారు. బృందావన్‌గార్డెన్‌న్స్‌ మూడో వీధిలో సిగ్నేచర్‌ డైన్‌ రెస్టారెంట్‌–కన్వెన్షన్‌ను శుక్రవారం మంత్రి గొట్టిపాటి ఎమ్మెల్యేలు గళ్లా మాధవి, నసీర్‌ అహ్మద్‌, మేయర్‌ కోవెలమూడి రవీంద్ర ప్రారంభించారు. మంత్రి మాట్లాడుతూ అన్నిరకాల వేడుకలు నిర్వహించుకునేందుకు అనువుగా ఉందని అన్నారు. సంస్థ మేనేజింగ్‌ డైరెక్టర్‌ మన్నవ యుగంధర్‌ మాట్లాడుతూ సిగ్నేచర్‌ డైన్‌ రెస్టారెంట్‌–కన్వెన్షన్‌ను సరికొత్త హంగులతో అందుబాటులోకి తీసుకొచ్చామని అన్నారు. వెజ్‌, నాన్‌వెజ్‌ రెస్టారెంట్‌, బాంకెట్‌/ కాన్ఫరెన్స్‌ హాల్‌, ఫంక్షన్‌ హాల్‌, గ్రాండ్‌ బెడ్‌రూమ్‌, గ్రాండ్‌ కంఫర్ట్‌ రూమ్స్‌, ఎగ్జిక్యూటివ్‌ రూమ్స్‌, గ్రాండ్‌ క్లబ్‌ సూట్‌ రూమ్స్‌ అన్ని రకాల వసతులతో అందుబాటులో ఉన్నాయని చెప్పారు.

తిరుమలలో అన్నదానం చేసిన భాష్యం రామకృష్ణ 1
1/1

తిరుమలలో అన్నదానం చేసిన భాష్యం రామకృష్ణ

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement