పల్నాడు పండుగ అభయాంజనేయ స్వామి రథయాత్ర
పిడుగురాళ్ల: పల్నాడు ప్రాంతానికే పెద్ద పండుగ శ్రీ సువచర్చల సమేత ప్రసన్నాంజనేయస్వామి తిరునాళ్ల. నిరంతరం హోమాలతో నాలుగు రోజులపాటు స్వామివారి పూజా కార్యక్రమాలు అంగరంగ వైభవంగా నిర్వహిస్తారు. జనవరి 28వ తేదీ అంటేనే పిడుగురాళ్ల పట్టణానికి ఓ పెద్ద పండుగ రోజు, చుట్టాలు, బంధువులు, కులమతాలకు అతీతంగా పిడుగురాళ్ల పట్టణానికి చేరుకుంటారు. ఈ నెల 25వ తేదీ నుంచే ప్రత్యేక పూజలతో మొదలవుతుంది. ఈ నాలుగు రోజులు స్వామివారి కల్యాణ మహోత్సవ వేడుకలు అంగరంగ వైభవంగా జరుగుతాయి. 28వ తేదీన రథోత్సవం జరుగుతుంది. మహిళా భక్తులతో కలశ శోభాయాత్రను పంచముఖ ఆంజనేయస్వామి దేవాలయం వరకు నిర్వహిస్తారు. పలు రకాల కలశాలతో మహా కుంభాభిషేకం, ప్రధాన కలశ శోభాయాత్ర నిర్వహిస్తారు. సుమారు 3 వేల మంది మహిళలచే మహా కుంభ కలశ యాత్ర నిర్వహిస్తారు. ఒక పిడుగురాళ్ల పట్టణమే కాకుండా చుట్టు పక్కల గ్రామాల నుంచి, జిల్లాల్లోని పలు గ్రామాల నుంచి చుట్టు పక్కల జిల్లాలు, పక్కనే ఉన్న తెలంగాణ వంటి రాష్ట్రాల నుంచి భక్తులు విశేషంగా హాజరై స్వామివారి కల్యాణం, రథోత్సవంలో పాల్గొంటారు.
28న స్వామి వారి 19వ వార్షిక
రథయాత్రకు సర్వం సిద్ధం
25 నుంచి ప్రారంభం కానున్న
ప్రత్యేక పూజలు
పల్నాడు పండుగ అభయాంజనేయ స్వామి రథయాత్ర


