రాష్ట్ర స్థాయి రెజ్లింగ్ పోటీలకు జిల్లా జట్లు ఎంపిక
అచ్చంపేట : పల్నాడు జిల్లా అమెచ్యూర్ రెజ్లింగ్ అసోసియేషన్ ఆధ్వర్యంలో స్థానిక డాక్టర్ అంబేద్కర్ సాంఘిక సంక్షేమ బాలుర గురుకుల పాఠశాల/కళాశాలలో శుక్రవారం జిల్లా స్థాయి రెజ్లింగ్ పోటీలు జరిగాయి. పోటీలలో విజేతలుగా నిలచినవారు ఫిబ్రవరి 5,6,7,8 తేదీలలో చిత్తూరులో జరిగే రాష్ట్ర పోటీలలో పాల్గొంటారని అసోసియేషన్ కార్యదర్శి గుడిపూడి భూషణం తెలిపారు.
బాలుర విభాగంలో....
● అండర్–15 బాలుర విభాగంలో కె.జాన్‌వెస్లి, ఆర్. చక్రి, పి.నాగరైతన్య, ఒ.గౌరీ ప్రతాప్‌రాజ్, కె.గుణశేఖర్, బి.యశ్వంత్, ఎన్.మెజెస్‌రత్న, సందీప్, ఐ.దేవకుమార్, టి.సుమంత్, ఆర్ ప్రణీత్‌లు ఎంపికయ్యారు.
● అండర్–17 విభాగంగాలో పి.నాగచైతన్య, ఒ.గౌరి ప్రతాప్‌రాజ్, కె.గోపయ్య, బి.ప్రసన్నకుమార్, పి.శరత్‌కుమార్, జి.డేనియల్‌రాజు, ఎస్, మోజస్ కుమార్, బి.అంజనీ కుమార్‌నాయక్, బి.ఒబేదు, వి.పృధ్వీ, ఎస్.మోజస్, బి.నరసింహనాయక్, జి.శ్రీనాథ్‌కుమార్, వి.నాగచరణ్‌లు ఎంపికయ్యారు.
● అండర్–20 విభాగంలో కె.గోపయ్య, పి.శరత్‌కుమార్, ఎల్.ఈశ్వర్ లక్ష్మీరాం, ఎం.వెంకటేశ్వర్లు, వి.పృధ్వీ, కె.గోపీచంద్ ఎంపికయ్యారు.
బాలికల విభాగం...
● అండర్–15 బాలికల విభాగంలో ఎం.అనూష, ఎం.హేమ, ఎన్.సందన, సీహెచ్ శ్రీనిత్య, ఎ.పూజిత, ఎన్.స్వాహితి, సీహెచ్ ధరణి, ఎస్ మేరీ వినీల తదితరులు ఎంపికయ్యారు.
● అండర్–17 విభాగంలో కె.దీవెన, పి.మనస్విని, ఎన్. ఐశ్వర్య, ఎం.కాయని, సీహెచ్ చందు, ఆర్. అనూష తదితరులు ఎంపికయ్యారు.
కార్యక్రమంలో పల్నాడు జిల్లా రెజ్లింగ్ అసోసియేషన్ ఽకార్యదర్శి గుడిపూడి భూషణం, జాయింట్ సెక్రటర్ పి.మహేష్ తదితరులు పాల్గొన్నారు.


