ఘనంగా ప్రారంభమైన ఎన్‌ఈసీ జుబిలేషన్
నరసరావుపేట రూరల్: దేశ అభివృద్ధికి సాంకేతిక పురోగతే కీలక ఆధారమని నరసరావుపేట ఇంజనీరింగ్ కళాశాల వైస్ చైర్మన్ మిట్టపల్లి చక్రవర్తి తెలిపారు. కళాశాలలో జాతీయ స్థాయి టెక్నికల్, మానేజిక్స్, కల్చరల్, క్రీడా వేడుకల జుబిలేషన్ 2కే 26శుక్రవారం ప్రారంభమైంది. 42 కళాశాలల నుంచి 900మంది విద్యార్థులు పోటీలలో పాల్గొన్నారు. కళాశాల వైస్ చైర్మన్ చక్రవర్తి జ్యోతి ప్రజ్వలన చేసి వేడుకలను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ డిజిటల్ యుగంలో అర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, మెషిన్ లెర్నింగ్, క్లౌడ్ కంప్యూటింగ్, స్టార్ట్‌అప్స్ వంటి రంగాలు యువతకు అపార అవకాశాలను అందిస్తున్నాయని తెలిపారు.
● జేఎన్‌టీయూఎన్ కళాశాల ప్రిన్సిపల్ ప్రొఫెసర్ సీహెచ్ శ్రీనివాసరావు మాట్లాడుతూ విద్యార్థుల్లో దాగి ఉన్న సాంకేతిక, నిర్వాహాక, సృజనాత్మక నైపుణ్యాలను వెలికి తీసేందుకు జాతీయ స్థాయి వేడుకలు వేదికలుగా నిలుస్తాయని తెలిపారు.
● శనివారం నిర్వహించే వేడుకలలో ప్రముఖ సినీ తార శ్రీలీల పాల్గొంటారని కళాశాల కార్యదర్శి మిట్టపల్లి రమేష్‌బాబు తెలిపారు.
కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ టి.ఆంజనేయులు, వైస్ ప్రిన్సిపల్ డాక్టర్ డి.సునీల్, అధ్యాపకులు పాల్గొన్నారు.
42 కళాశాలల నుంచి 900 మంది విద్యార్థులు హాజరు
నేడు కల్చరల్ ఫెస్ట్


