‘పచ్చ’ పగకు | - | Sakshi
Sakshi News home page

‘పచ్చ’ పగకు

Jan 23 2026 6:43 AM | Updated on Jan 23 2026 6:43 AM

‘పచ్చ

‘పచ్చ’ పగకు

శుక్రవారం శ్రీ 23 శ్రీ జనవరి శ్రీ 2026 నిమ్మకాయల ధరలు ఓటరు దినోత్సవంపై అవగాహన సొసైటీ గోదాంలో ఎరువులు మాయం

న్యూస్‌రీల్‌

రూ.34.58 లక్షల విలువైన సరుకు పక్కదారి గోదాం నిర్వాహకుడిపై కేసు

రామాపురం ఘటనలో వైఎస్సార్‌సీపీ నేతలపై వేధింపులు దర్యాప్తు పేరుతో తీవ్రంగా ఇబ్బంది పెట్టిన పోలీసులు వైఎస్సార్‌సీపీకి చెందిన ఆరుగురిపై టీడీపీ నేతల ఫిర్యాదు ఆగమేఘాలపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టిన పోలీసులు

ఊరిలో లేని వారిపై ఫిర్యాదు

పల్నాడు
శుక్రవారం శ్రీ 23 శ్రీ జనవరి శ్రీ 2026
పల్నాటి పల్లెల్లో పచ్చ ముఠాల పైశాచికత్వం నానాటికీ ఎక్కువ అవుతోంది. వారి పగకు వైఎస్సార్‌సీపీ శ్రేణుల రక్తం చిందుతోంది. హత్యలు, దాడులు, బెదిరింపులతో బరితెగించిన పచ్చ బ్యాచ్‌కు ఖాకీలు కథలు నేర్పుతున్నారు. కేసులు ఎలా పెట్టాలి? అసలు సంబంధం లేని వారిని కూడా కేసుల్లో ఎలా ఇరికించాలో చెప్పి మరీ వెనకుండి టీడీపీ గూండాలను నడిపిస్తున్నారు. బాధితులపైనే అక్రమ కేసులు బనాయించి శాంతిభద్రతలను దారుణంగా దిగజారుస్తున్నారు.

తెనాలి: తెనాలి మార్కెట్‌ యార్డులో గురువారం క్వింటా నిమ్మకాయలు కనిష్ట ధర రూ.2,600, గరిష్ట ధర రూ.3,700, మోడల్‌ ధర రూ.3,000 వరకు పలికింది.

వినుకొండ : జాతీయ ఓటరు దినోత్సవాన్ని పురస్కరించుకొని ఎన్‌ఎస్‌పీ కాలనీ జెడ్పీ ఉన్నత పాఠశాల విద్యార్థులకు ఎన్నికల అధికారి శ్రీరాములు అవగాహన కల్పించారు.

ముప్పాళ్ళ: మండలంలోని దమ్మాలపాడు గ్రామంలో గల ధూళిపాళ్ల ఆంధ్రాబ్యాంక్‌ రైతు సేవ సహకార సంఘం పరిధిలోని గోదాంలో రూ.34.58 లక్షల విలువ చేసే ఎరువులు మాయం అయ్యాయి. దీనిపై సంఘ చైర్మన్‌ కంచేటి సుబ్బారావు ఫిర్యాదు మేర గోదాం నిర్వాహకుడిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ పి.అనిల్‌కుమార్‌ గురువారం తెలిపారు. పోలీసులు తెలిపిన వివరాల మేరకు... దమ్మాలపాడు గ్రామంలో గల గోదాంలో అల్లూరి మల్లినాథశర్మ ఎరువుల స్వీకరణ, నిల్వ, విక్రయాల ద్వారా వచ్చిన డబ్బులు జమ చేసేవారు. గత ఏడాది మార్చి 31వ తేదీ నాటికి 11,705 ఎరువుల బస్తాలు నిల్వ ఉన్నట్లుగా, ఏప్రిల్‌ నుంచి ఈ ఏడాది జనవరి 5వ తేదీ వరకు 22,092 బస్తాలు సరఫరా కాగా 24,389 బస్తాలు అమ్మినట్లు రికార్డుల్లో చూపించారు. ఈ క్రమంలో 3,563 బస్తాలు మాయమైనట్లుగా నిర్ధారించారు. ఈ నెల 7వ తేదీన నిర్వాహకుడు మల్లినాథశర్మ వాటికి సంబంధించిన రూ.34.58 లక్షలు చెల్లిస్తానని రాతపూర్వకంగా తెలిపారు. కానీ చెల్లించకపోవడంతో చైర్మన్‌ ముప్పాళ్ళ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. ఈ మేరకు కేసు దర్యాప్తు చేస్తునట్లు ఎస్‌ఐ తెలిపారు.

సాక్షి టాస్క్‌ఫోర్స్‌: చంద్రబాబు ప్రభుత్వంలో అక్రమ కేసుల పరంపరం కొనసాగుతూనే ఉంది. లోకేష్‌ రెడ్‌బుక్‌ రాజ్యాంగాన్ని కూటమి నేతలతో పాటుగా పోలీసులు సిగ్గు విడిచి అమలు చేస్తున్నారు. వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ నేతలు, కార్యకర్తలపైనే టీడీపీ ముఠాలు హత్యలకు, దాడులకు, బెదిరింపులకు తెగబడుతున్నాయి. మళ్లీ వైఎస్సార్‌సీపీ వారిపైనే అక్రమ కేసులు పెడుతూ రాక్షసానందం పొందుతున్నారు. ఇందుకు పోలీసులు నిస్సిగ్గుగా మద్దతు ఇస్తున్నారు. గురజాల నియోజకవర్గంలో నానాటికీ పరిస్థితి దిగజారుతోంది.

బాధితులపైనే వేధింపుల పర్వం

తాజాగా రామాపురం ఎంపీటీసీ సభ్యురాలు ఆకూరి రాజేశ్వరి భర్త, వైఎస్సార్‌సీపీ నేత ఆకూరి వెంకటరెడ్డిపై టీడీపీ నాయకులు హత్యాయత్నం చేసినా పోలీసులకు మాత్రం అదే టీడీపీ నేతల ఫిర్యాదుతో అక్రమ కేసు నమోదు చేశారు. మాచవరం మండలం పిన్నెల్లికి చెందిన వైఎస్సార్‌సీపీ దళిత కార్యకర్త మందా సాల్మన్‌పై అదే గ్రామానికి చెందిన టీడీపీ నాయకులు మోటుమర్రి పేతురు, అతని తమ్ముడు కాంతారావు విచక్షణరహితంగా దాడి చేసి తీవ్రంగా గాయపరిచారు. వివాదరహితుడైన సాల్మన్‌పైనే దాడి చేసి చివరకు ఆయనే దాడి చేశారని పోలీసులకు ఫిర్యాదు చేయటంతో కేసు నమోదైంది. చికిత్స పొందుతూ సాల్మన్‌ మృత్యువాత పడ్డారు. తాజాగా ఆకూరి వెంకటరెడ్డిపై పక్కా ప్రణాళికతో టీడీపీ నాయకులు హత్యాయత్నం చేశారు. ఇనుపరాడ్లు, సుత్తులతో ప్రణాళికతో టీడీపీ నాయకులు దాడికి తెగబడిన సమయంలో వెంకటరెడ్డి దాచేపల్లికి సాదాసీదాగా ద్విచక్రవాహనంపై వస్తున్నారు. దాడికి పాల్పడిన టీడీపీ నాయకులు తలకు, కాళ్లు, చేతులకు గాయాలైనట్లుగా ఆసుపత్రికి వెళ్లి కట్లు కట్టించుకున్నారు. దాడి చేసిన వారికెలా గాయాలు అయ్యాయని నియోజకవర్గంలో విస్తృతంగా చర్చ జరుగుతోంది. వెంకటరెడ్డిపైనే దాడి చేసి, తిరిగి అతనిపైనే కేసు పెట్టటంపై ప్రజలు విస్మయం వ్యక్తం చేస్తున్నారు.

అంతా పోలీసుల పనే

వైఎస్సార్‌సీపీ కార్యకర్తలు, నాయకులపై అక్రమ కేసులు నమోదు చేసే విషయంలో పోలీసులే అన్ని పాత్రలు పోషిస్తున్నారు. దాడి ఘటన తరువాత ఏ విధంగా కేసులు పెట్టాలి... వైఎస్సార్‌సీపీకి చెందిన వ్యక్తుల్లో ఏవరెవరిపై ఏ విధంగా ఫిర్యాదులు చేయాలి... టీడీపీ నాయకులు చెప్పిన వారిని ఎలా ఇబ్బంది పెట్టాలో పోలీసులే ముందుండి నడిపిస్తున్నారు. పిన్నెల్లికి చెందిన వైఎస్సార్‌సీపీ దళిత కార్యకర్త మందా సాల్మన్‌పై జరిగిన దాడిలో కేసులో పోలీసులు వ్యవహరించిన తీరుపై పలువురు ఆగ్రహం వ్యక్తం చేశారు. తాజాగా రామాపురం ఘటనపై కూడా టీడీపీ నాయకులు చెప్పినట్లే కేసులు పెట్టి వేధించేలా దాచేపల్లి పోలీసులు యాక్షన్‌ప్లాన్‌ సిద్ధం చేసినట్లుగా చర్చ జరుగుతోంది. ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న వెంకటరెడ్డి నుంచి వివరాలు తీసుకున్న పోలీసులు కేసు నమోదు చేసినా దర్యాప్తు చేపట్టలేదు. టీడీపీ నాయకులు ఫిర్యాదు ఇచ్చిన వెంటనే వైఎస్సార్‌సీపీ నాయకులు, కార్యకర్తల ఇళ్లకు వెళ్లిన పోలీసులు వారిని వేధించటం ప్రారంభించారు. ప్రజలను కాపాడాల్సిన పోలీసులే లోకేష్‌ రెడ్‌బుక్‌ రాజ్యాంగం అమలు చేసేందుకు తహతహలాడుతున్నారు. ఆకూరి వెంకటరెడ్డి ఫిర్యాదు మేరకు టీడీపీకి చెందిన ఆరుగురికిపై కేసు నమోదు చేశారు. అదే విధంగా టీడీపీ నేతలపై వైఎస్సార్‌సీపీ నేతలు దాడి చేశారని టీడీపీ నాయకుడు వేముల వెంకటరెడ్డి ఫిర్యాదు చేయటంతో ఆరుగురిపై కేసు నమోదు చేశారు. పోలీసుల తీరులో మార్పురాకపోతే బాధితుడికి న్యాయం జరగకపోగా, బాధితుడే జైలుపాలు అయ్యే పరిస్థితులు కనిపిస్తున్నాయి.

7

కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత రామాపురంలో రెడ్డి సామాజికవర్గానికి చెందిన కొన్ని కుటుంబాలు ఊరు వదిలి వెళ్లిపోయాయి. కేసు నమోదు చేసిన వారిలో పలువురు ఊరిలోనే లేరు. పోలీసులు రామాపురం వెళ్లి వీరి ఇళ్ల వద్ద దర్యాప్తు పేరుతో వేధింపులు ప్రారంభించారు. వాస్తవానికి దాడి జరిగిన రోజున ఘటన స్థలంలో బాధితుడైన వెంకటరెడ్డి తప్ప ఇంకెవ్వరు లేరు. మిగిలిన వారంతా అక్కడే ఉంటే టీడీపీ నాయకులపై కూడా దాడి జరిగేది కదా అని ప్రజలు చర్చించుకుంటున్నారు. కర్నాటి సైదారెడ్డిపై నాలుగుసార్లు టీడీపీ నాయకులు దాడి చేస్తే పోలీసులకు ఫిర్యాదులు చేసినా పట్టించుకోలేదు. ఈ దాడిలో ఎలాంటి సంబంధం లేని వ్యక్తులపై కేసులు పెట్టి గ్రామంలోకి వారిని రానీయకుండా.. ఉద్రిక్త వాతావరణం ఉండేలా టీడీపీ నాయకులు కుట్రలు చేస్తున్నట్లు ప్రజలు చర్చించుకుంటున్నారు.

‘పచ్చ’ పగకు 1
1/9

‘పచ్చ’ పగకు

‘పచ్చ’ పగకు 2
2/9

‘పచ్చ’ పగకు

‘పచ్చ’ పగకు 3
3/9

‘పచ్చ’ పగకు

‘పచ్చ’ పగకు 4
4/9

‘పచ్చ’ పగకు

‘పచ్చ’ పగకు 5
5/9

‘పచ్చ’ పగకు

‘పచ్చ’ పగకు 6
6/9

‘పచ్చ’ పగకు

‘పచ్చ’ పగకు 7
7/9

‘పచ్చ’ పగకు

‘పచ్చ’ పగకు 8
8/9

‘పచ్చ’ పగకు

‘పచ్చ’ పగకు 9
9/9

‘పచ్చ’ పగకు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement