కల్యాణ వైభోగమే..!
అమరావతి: భక్తుల పాలిట కొంగుబంగారంగా, స్వయంభూగా.. పిలిస్తే పలికే దేవుడుగా మండల పరిధిలోని మల్లాది గ్రామంలో వెలసిన శ్రీవటవృక్షాంతర్గత వేంకటేశ్వరుని 49వ వార్షిక కల్యాణ మహోత్సవం గురువారం కనులపండువగా నిర్వహించారు. ఆలయ అర్చకుడు వినుకొండ శ్రీనివాసాచార్యులు ఆధ్వర్యంలో వేకువజామున కల్యాణ మహోత్సవ కార్యక్రమాలలో భాగంగా సుప్రభాతసేవతో స్వామి వారిని మేల్కొలిపి ప్రాతఃకాల అర్చన నిర్వహించారు. అనంతరం బిందెతీర్ధంతో స్వామివారికి పంచసూక్తాలతో పంచామృత స్నపనను సశాసీ్త్రయంగా చేశారు. అనంతరం తులసీ దళాలతో స్వామివారికి సహస్రనామ తులసీదళసేవతో స్వామివారికి విశేష అలంకారం నిర్వహించారు. మధ్యాహ్నం దేవాలయ ఉత్తరభాగంలో ప్రత్యేకంగా అలంకరించిన మండపంలో ఉత్సవ మూర్తులను ఉంచి కల్యాణోత్సవం నిర్వహించారు వైఖానస ఆగమ ప్రకారం పరుచూరి శ్రీనివాసాచార్యులు నేతృత్వంలో సుమారు 50 మంది దంపతులచే స్వామివారి కల్యాణాన్ని వైభవోపేతంగా నిర్వహించారు. సాయంత్రం ఐదు గంటలకు భూదేవి, శ్రీదేవి సమేతుడైన వేంకటేశ్వరుడు పెదశేష వాహనం అంగరంగ వైభవంగా గ్రామోత్సవం నిర్వహించారు. భక్తులకు ఉచిత ప్రసాదాలను అందజేశారు.
భక్తులకు అన్న సంతర్పణ
శ్రీ వటవృక్షాంతర్గత వేంకటేశ్వరస్వామి వారి 49వ వార్షిక కల్యాణ మహోత్సవం సందర్భంగా హాజరైన భక్తులందరికీ మల్లాది గ్రామస్తుడు బత్తినేని శంకర్ గ్రామస్తుల సహకారంతో అన్నసంతర్పణ కార్యక్రమం నిర్వహించారు. ఈకార్య క్రమంలో వైఎస్సార్ సీపీ ిసీఈసీ మెంబర్ వెంపా జ్వాలాలక్ష్మీనరసింహారావు, వైఎస్సార్ సీపీ మండల అధ్యక్షుడు భవిరి శెట్టి హనుమంతరావులతో పాటు నాయకులు వెంపా వాసు, వెంపా శ్రీను, తిరుపతిరావు తదితరులు పాల్గొన్నారు. ఈకార్యక్రమంలో జిల్లా నలుమూలల నుంచి భక్తులు వేలాదిగా పాల్గొన్నారు.
కనుల పండువగా మల్లాది వేంకటేశ్వరుని కల్యాణోత్సవం
కల్యాణ వైభోగమే..!


