ఐస్ స్కేటింగ్‌లో రజతం
మొగల్రాజపురం(విజయవాడ తూర్పు): స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా ఆధ్వర్యాన లడఖ్‌లో ఈ నెల 20న జరిగిన ఖేలో ఇండియా వింటర్ గేమ్స్–2026లో గుంటూరు జిల్లా మంగళగిరికి చెందిన జెస్సీ రాజ్ సీనియర్ గరల్స్ ఫిగర్ స్కేటింగ్ కేటగిరీలో రజత పతకాన్ని గెలుచుకున్నారు. జెస్సీరాజ్ విజయవాడలోని ఎన్‌ఎస్‌ఎం పబ్లిక్ స్కూల్‌లో 10వ తరగతి విద్యార్థిని. ఐస్ స్కేటింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా అధ్యక్షుడు అమితాబ్ శర్మ, సెక్రటరీ జగరాజ్ సింగ్ సహానీ, ఫిగర్ స్కేటింగ్ హెడ్ నటాలి, ఏపీ ఐస్ స్కేటింగ్ అసోసియేషన్ అధ్యక్షుడు మురళి, సెక్రటరీ ఖాజా, కోచ్ అబ్దుల్ హఫీజ్ వెండి పతకాన్ని సాధించిన జెస్సీరాజ్‌ను అభినందించారు.
తెనాలి: శాలివాహన సంఘం (కుమ్మరి), తెనాలి వారి ఆధ్వర్యంలో రెండు తెలుగు రాష్ట్రాల మొదటి శాలివాహన వధూవరుల పరిచయ వేదికను తెనాలిలో నిర్వహించనున్నారు. శాలివాహన సంఘం (కుమ్మరి) నాయకులు గురువారం చెంచుపేటలో ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో వివరాలను తెలియజేశారు. రెండు తెలుగు రాష్ట్రాలకు సంబంధించి తొలి శాలివాహన వధూవరుల పరిచయ వేదికను తెనాలిలో జరుపపన్నుట్టు చెప్పారు. ఫిబ్రవరి 22వ తేదీన స్థానిక ఎన్జీవో కల్యాణమండపంలో జరిగే వధూవరుల పరిచయవేదిక, శాలివాహన సంఘం, తెనాలి గౌరవ అధ్యక్షుడు, మున్సిపల్ కౌన్సిలర్ పసుపులేటి త్రిమూర్తి, ఆర్గనైజర్ వేజండ్ల శివన్నారాయణ పర్యవేక్షణలో జరుగుతుందని తెలిపారు. రిజిస్ట్రేషన్ కోసం72044 95747, 92472 71344, 70135 01766 నంబర్లను సంప్రదించాలని సూచించారు. రిజిస్ట్రేషనుకి ఫిబ్రవరి 15వ తేదీ తుది గడువుగా వివరించారు. విలేకరుల సమావేశంలో కార్యదర్శి నిమ్మకూరి కమలాకరరావు, ఉరిటి వెంకట్రావు, ఉరిటి శివశంకరావు, ఉరిటి నాగేశ్వరరావు, వేజండ్ల శంకరరావు, వేజండ్ల కృష్ణారావు, ఉప్పలపాటి వెంకటేశ్వరరావు, వేజండ్ల నాగరాజు, సాయికిషోర్ పాల్గొన్నారు.
రూ.5 లక్షల మేర ఆస్తి నష్టం
ఇంకొల్లు(చినగంజాం): విద్యుత్ షార్ట్ సర్క్యూట్ కారణంగా మండల కేంద్రమైన ఇంకొల్లులోని ఓ భవనంలో అగ్ని ప్రమాదం సంభించింది. ఈ సంఘటన గురువారం ఆలస్యంగా వెలుగు చూసింది. బాధితుల కథనం ప్రకారం.. ఇంకొల్లులోని పర్చూరు రోడ్డులో ఎస్‌బీఐ బ్యాంక్ సమీపంలో గల భవనంలో షేక్ ఇబ్రహీం కుటుంబం మూడో అంతస్తులో నివసిస్తోంది. బుధవారం రాత్రి ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఒక్కసారిగా పొగలు దట్టంగా వ్యాపించాయి. అదే భవనంలో ఉంటున్న వారిని కలిసేందుకు ఇబ్రహీం భార్య అక్తర్ కిందకు దిగి వచ్చిన సమయంలో విద్యుత్ తీగలు షార్ట్ సర్క్యూట్ అయ్యాయి. చుట్టుపక్కల వారు గమనించి మంటలను అదుపులోకి తీసుకొచ్చారు. అయితే అప్పటికే ఇంటిలోని వస్తువులన్నీ పూర్తిగా ఆహుతయ్యాయి. ఇంట్లో దాచి ఉంచిన రూ 2,14,000 నగదు, బీరువా, మంచం, ఏసీ, దుస్తులు, ఫర్నిచర్ కాలిపోయాయని, సుమారు రూ 5 లక్షలు మేర ఆస్తి నష్టం సంభవించిందని బాధితులు చెప్పారు. ఇబ్రహీం దంపతులు కట్టుబట్టలతో మిగిలారు.
ఐస్ స్కేటింగ్‌లో రజతం


