ఇంటర్మీడియెట్ పరీక్షలు సజావుగా నిర్వహించాలి
కలెక్టర్ డాక్టర్ కృతికా శుక్లా
నరసరావుపేట:జిల్లాలో ఇంటర్మీడియెట్ పరీక్ష లు సజావుగా నిర్వహించాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ కృతికా శుక్లా అధికారులను ఆదేశించారు. క్యాంపు కార్యాలయంలో బుధవారం పరీక్షల సన్నద్ధతపై సంబంధిత శాఖల అధికారులతో సమావేశం నిర్వహించారు. కలెక్టర్ మాట్లాడు తూ పరీక్షలకు సంబంధించి కాన్ఫిడెన్షియల్ మె టీరియల్ స్టోరేజ్ సెంటర్, పేపర్ల పంపిణీ విషయంలో పోలీసుల బందోబస్తు మధ్య ఏర్పాటు కు అన్ని చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. రెవెన్యూ శాఖ డీటీ స్థాయి అధికారి, పోలీస్ శాఖ ఏఎస్‌ఐ స్థాయి అధికారి, ఫ్లయింగ్ స్క్వాడ్ అధికారులను మూడు టీంలను ఏర్పాటు చేయాలని సూచించారు. వేసవి దృష్ట్యా విద్యార్థులకు ఎ లాంటి ముందస్తు అవరోధాలు కలగకుండా త గిన జాగ్రత్తలు తీసుకోవాలని పంచాయతీ, ము న్సిపల్, వైద్య ఆరోగ్య శాఖ అధికారులను ఆదేశించారు. విద్యార్థులకు ఆర్టీసీ,విద్యుత్ సౌక ర్యం అందుబాటులో ఉంచాలని, సమస్యాత్మకమైన పరీక్ష కేంద్రాల వద్ద ప్రత్యేక పోలీసు బందోబస్తు ఏర్పాటుచేయాలని, మాస్ కాపీయింగ్ జరగకుండా జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు.
మద్యం తాగి వాహనాలు నడుపుతున్న నలుగురికి జైలు
గుంటూరులీగల్:గుంటూరు నగరంలో జరిగిన డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీల్లో మద్యం తాగినట్లు నిర్ధారణ అయిన నలుగురిని అరెస్టు చేసిన పోలీసులు కోర్టులో హాజరు పరిచారు. నలు గు రు మద్యం తాగి వాహనాలు నడిపినట్లు నిర్ధా రణ కావడంతో ఒక్కొక్కరికి మూడు రోజులు జైలు శిక్ష విధిస్తూ ఆరవ అదనపు జూనియర్ సివిల్ జడ్జి కోర్టు న్యాయమూర్తి మహమ్మద్ గౌస్ బుధవారం తీర్పు వెలువరించారు. వీరిలో ఇద్దరు ఆటో డ్రైవర్లు, ఒక కారు డ్రైవర్, మరొకరు ద్విచక్ర వాహనం నడుపుతున్నారు. వీరిని గుంటూరు జిల్లా జైలుకు తరలించారు.


