వైఎస్సార్‌ సీపీ నాయకులే టార్గెట్‌ | - | Sakshi
Sakshi News home page

వైఎస్సార్‌ సీపీ నాయకులే టార్గెట్‌

Jan 22 2026 7:17 AM | Updated on Jan 22 2026 7:17 AM

వైఎస్సార్‌ సీపీ నాయకులే టార్గెట్‌

వైఎస్సార్‌ సీపీ నాయకులే టార్గెట్‌

వైఎస్సార్‌ సీపీ నాయకులే టార్గెట్‌

చంద్రబాబు ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత దాచేపల్లి మండలం రామాపురం గ్రామంలో వైఎస్సార్‌ సీపీ నాయకులు, కార్యకర్తలపై దాడులు యథేచ్ఛగా జరుగుతున్నాయి. టీడీపీ నాయకులు రెచ్చిపోయి దాడులకు పాల్పడుతూ గ్రామంలో ప్రశాంతత లేకుండా చేస్తున్నారు. చంద్రబాబు ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత వైఎస్సార్‌సీపీ నాయకులు వేముల లక్ష్మారెడ్డి, అంబటి వెంకటరెడ్డి, కోట చంద్రంపై పలుమార్లు దాడులకు తెగబడ్డారు. వైఎస్సార్‌ సీపీ నాయకుల ఇళ్లకు వెళ్లి దాడులు చేసి తీవ్ర భయభ్రాంతులకు టీడీపీ నేతలు గురి చేశారు. గత వైఎస్సార్‌సీపీ ప్రభుత్వంలో దసరా పండుగ సందర్భంగా బతుకమ్మ ఊరేగింపులో టీడీపీ నాయకులు అలజడులు సృష్టించి కారం, కర్రలతో దాడులు చేశారు. టీడీపీ నాయకులే దాడులు చేసి గాయపడిన వారి మీదే కేసులు పెట్టించి జైలుపాలు చేస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement