రెడ్ల సత్రానికి రూ.5 లక్షల విరాళం
నరసరావుపేట రూరల్: కోటప్పకొండలోని యోగివేమారెడ్డి ఛారిటబుల్ ట్రస్ట్, రెడ్లసత్రానికి నడమర్రు గ్రామానికి చెందిన మర్రెడ్డి సంజీవరెడ్డి రూ.5లక్షలు విరాళంగా అందజేశారు. సత్రం కార్యాలయంలో బుధవారం జరిగిన కార్యక్రమంలో విరాళం మొత్తాన్ని సత్రం కమిటీ సభ్యులకు అందించారు. సత్రంలో నూతన గదుల నిర్మాణానికి ఈ విరాళం అందజేసినట్టు దాత సంజీవరెడ్డి తెలిపారు. కార్యక్రమంలో సత్రం కమిటి కార్యదర్శి పొలిమేర వెంకటరెడ్డి, కోశాధికారి మాగులూరి సుబ్బారెడ్డి, వర్కింగ్ ప్రెసిడెంట్ మెట్టు పాపిరెడ్డి, మాజీ అధ్యక్షుడు గాయం కృష్ణారెడ్డి, మాజీ ఉపాధ్యక్షుడు మర్రెడ్డి రామకృష్ణారెడ్డిలు పాల్గొన్నారు.


