ఏడాదైనా పరిహారం ఏదీ ?
గతేడాది డయేరియాతో మృతి చిందిన వారు
రాష్ట్రంలో అసమర్థ ప్రభుత్వం
●కలుషిత నీరు తాగి చనిపోయిన వారి కుటుంబాలకు మొండిచేయి
●కనీసం ఆదుకోవడానికి కూడా
మనసు రాని చంద్రబాబు ప్రభుత్వం
●మంత్రి, ఎమ్మెల్యేల పరామర్శల వేళ ఇచ్చిన హామీల అమలు శూన్యం
●సంవత్సరం దాటినా బాధిత
కుటుంబాలకు పరిహారం కలే
సాక్షి, టాస్క్‌ఫోర్స్: తాగునీరు కలుషితమై డయేరియా బారినపడి చనిపోయిన వారి కుటుంబాలకు ఏడాది దాటినా కనీసం పరిహారం అందించకపోవటంతో బాధితులు ఆవేదన వ్యక్తం చెందుతున్నారు. చంద్రబాబు ప్రభుత్వం వచ్చిన తర్వాత పిడుగురాళ్ల పట్టణంలోని లెనిన్‌నగర్, మారుతీనగర్ ప్రాంతంలో తాగునీరు కలుషితమైంది. ఫలితంగా డయేరియా బారిన పడి ఐదుగురు చనిపోయారు. గత టీడీపీ ప్రభుత్వంలో జూన్ నెలలో పిడుగురాళ్ల పట్టణంలోని పిల్లలగడ్డల ప్రాంతంలో డయేరియా కారణంగా అప్పట్లో కందుల మాబు చనిపోయాడు. ఆయన కుటుంబ సభ్యులకు కూడా ప్రభుత్వం పరిహారం అందించలేదు.
కనికరమే లేదు..
చంద్రబాబు ప్రభుత్వం వచ్చిన తర్వాత 2024లో గురజాల నియోజకవర్గంలోని పిడుగురాళ్ల పట్టణంలో ఐదుగురు కలుషిత నీరు తాగి డయేరియా బారిన పడ్డారు. తర్వాత మృతి చెందారు. అలాగే దాచేపల్లి మండలంలోని అంజనీపురానికి చెందిన తమ్మిశెట్టి వెంకటేశ్వర్లు, బండారు చిన్న వీరయ్య కూడా మృతి చెందారు. స్థానిక ఎమ్మెల్యే యరపతినేని శ్రీనివాసరావు బాధిత కుటుంబాలను పరామర్శించేందుకు మున్సిపల్ శాఖ మంత్రి పొంగూరు నారాయణను పిలిపించారు. బాధిత కుటుంబాలకు ప్రభుత్వం ఆదుకుటుందని, పరిహారం కచ్చితంగా అందిస్తామని మృతుల కుటుంబ సభ్యులకు హామీ ఇచ్చారు. ఇది జరిగి ఏడాది అవుతున్నప్పటికీ మృతుల కుటుంబ సభ్యులకు పరిహారం అందని ద్రాక్షగానే మిగిలింది. గత టీడీపీ ప్రభుత్వ హయాంలో కూడా పిడుగురాళ్ల పట్టణంలోని పిల్లల గడ్డ ప్రాంతంలో డ్రైనేజీ అస్తవ్యస్తంగా ఉండటంతో తాగునీరు కలుషితమైంది. ఒకరు మృతి చెందారు. మరికొంత మంది అస్వస్థతకు గురై హాస్పటల్ పాలయ్యారు. ఆ సమయంలో కూడా యరపతినేని పరామర్శ కార్యక్రమాలు చేపట్టారు. పరిహారం మాత్రం మరిచిపోయారు.
మాటలకే పరిమితం
డయేరియా ప్రబలిన మారుతీనగర్, లెనిన్ నగర్ ప్రాంతాల్లో పది రోజులపాటు మున్సిపల్ అధికారులు, టీడీపీ నాయకులు హడావుడి చేశారు. డ్రైనేజీలను బాగు చేయించటం, చెత్త తొలగిస్తామని చెప్పి మున్సిపల్ నిధులను డ్రా చేసుకున్నారు. తర్వాత అధికారులు, నాయకులు... తాగునీటి కలుషితం వలనే డయేరియా వచ్చిందని తెలుసుకొని నీటిని పరీక్షలకు పంపించారు. మున్సిపల్ నిధులతో మాత్రం తమ జేబులు నింపుకొన్నారు. ఏడాది కావస్తున్నా కార్యాలయాలు, నాయకుల చుట్టూ ప్రదక్షిణ మినహా ప్రయోజనం లేకుండాపోయింది.
రెక్కాడితేగానీ డొక్కాడని వారే..
డయేరియా కారణంగా మరణించిన వారివి నిరుపేద కుటుంబాలు. పోషించే వారే మృతి చెందటం వలన నేడు మిగతా వారి పరిస్థితి అధ్వానంగా మారింది. పూట గడవడానికి కూడా తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. మహిళలు, పిల్లలు సైతం కూలి పనులు చేసుకొని జీవనం సాగించాల్సిన దుస్థితి నెలకొంది. ప్రభుత్వం, అధికారుల నిర్లక్ష్యం వలన పోయిన ప్రాణాలు ఎలాగో తిరిగి రావని.. కనీసం కుటుంబ సభ్యులనైనా ఆదుకునేందుకు ప్రభుత్వం బాధ్యత తీసుకోవాలని బాధితులు పేర్కొంటున్నారు. స్థానిక ఎమ్మెల్యే యరపతినేని స్పందించాని విజ్ఞప్తి చేస్తున్నారు.
సిద్దిక్
ఆంజనేయులు
తిరుపతమ్మ
నాగమణి
వెంకటేశ్వర్లు
తాగునీరు కలుషితమై ప్రజల ప్రాణాలు పోయినా పట్టించుకోని అసమర్థ ప్రభుత్వాన్ని ఎక్కడా చూడలేదు. గతంలోనూ టీడీపీ హయాంలో పిడుగురాళ్ల పట్టణంలో డయేరియాతో ఒకరు చనిపోయారు. అప్పుడూ పట్టించుకోలేదు. చంద్రబాబు ప్రభుత్వం వచ్చిన తర్వాత పిడుగురాళ్ల పట్టణంలో ఐదుగురు, దాచేపల్లి మండలంలో ఇద్దరు డయేరియాతో చనిపోయారు. మంత్రిని పిలిపించి పరామర్శింపజేశారు. పరిహారం మాత్రం అందించలేదు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో నేను ఎమ్మెల్యేగా ఉన్న ఐదు సంవత్సరాలలో శుద్ధి చేసిన తాగునీరు అందించాం. డయేరియా జాడ లేకుండా చేశాం.
– కాసు మహేష్‌రెడ్డి, మాజీ ఎమ్మెల్యే
ఏడాదైనా పరిహారం ఏదీ ?
ఏడాదైనా పరిహారం ఏదీ ?
ఏడాదైనా పరిహారం ఏదీ ?
ఏడాదైనా పరిహారం ఏదీ ?
ఏడాదైనా పరిహారం ఏదీ ?
ఏడాదైనా పరిహారం ఏదీ ?


