ఎరువులు అధిక ధరలకు విక్రయిస్తే చర్యలు | - | Sakshi
Sakshi News home page

ఎరువులు అధిక ధరలకు విక్రయిస్తే చర్యలు

Jan 22 2026 7:17 AM | Updated on Jan 22 2026 7:17 AM

ఎరువులు అధిక ధరలకు విక్రయిస్తే చర్యలు

ఎరువులు అధిక ధరలకు విక్రయిస్తే చర్యలు

కారెంపూడి: అధిక ధరలకు ఎరువులు విక్రయిస్తే కఠిన చర్యలు తప్పవని జిల్లా వ్యవసాయ శాఖ అధికారి ఎం. జగ్గారావు హెచ్చరించారు. కారెంపూడిలోని ఎరువుల దుకాణాలలో బుధవారం జిల్లా వ్యవసాయ శాఖ అధికారి విస్తృత తనిఖీలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎరువులను అధిక ధరలకు విక్రయిస్తే కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. కారెంపూడి మండలంలో సరిపడా యూరియా, ఎరువుల నిల్వలున్నాయని రైతులు తొందర పడి అధిక ధరలకు కొనవద్దని విజ్ఞప్తి చేశారు. అనంతరం మండలంలో ఈ క్రాప్‌ బుకింగ్‌ నమోదు తీరును పరిశీలించారు. రబీలో వేసిన ప్రతి ఎకరా పైరును ఈ క్రాప్‌ చేయించాలని వ్యవసాయశాఖ సిబ్బందిని ఆదేశించారు. రైతులు కూడా గ్రామంలో ఉన్న రైతు సేవా కేంద్రాల వద్దకు వెళ్లి తాము వేసిన పంట వివరాలను నమోదు చేయించుకోవాలని కోరారు. జిల్లా వ్యవసాయ శాఖ అధికారి వెంట మండల వ్యవసాయశాఖ అధికారి నరసింహారావు ఇతర అధికారులు పాల్గొన్నారు.

జిల్లా వ్యవసాయశాఖ అధికారి జగ్గారావు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement