డ్రాఫ్ట్ పట్టాదారు పాసుపుస్తకాల పంపిణీ
పలుదేవర్లపాడు(ముప్పాళ్ళ): రీ సర్వే పూర్తయిన గ్రామాల్లోని రైతులకు అందిస్తున్న డ్రాఫ్ట్(ముసాయిదా) పట్టాదారు పాసుపుస్తకాల పంపిణీ కార్యక్రమంలో జిల్లా జాయింట్ కలెక్టర్ సంజనా సింహ పాల్గొన్నారు. మండలంలోని పలుదేవర్లపాడు గ్రామంలో జరుగుతున్న పంపిణీ కార్యక్రమాన్ని బుధవారం పరిశీలించారు. డ్రాఫ్ట్ పట్టాదారు పాసు పుస్తకాల్లో ఏమైనా సవరణలు ఉంటే సంబంధిత రెవెన్యూ అధికారి దృష్టికి తీసుకొని వచ్చి సవరణ పూర్తి చేసుకోవచ్చన్నారు. ఫిబ్రవరి 2 నుంచి 9వ తేదీ వరకు పట్టాదారు పాసుపుస్తకాలు అందించటం జరుగుతుందని, ఈ లోపు ముసాయిదా పుస్తకాల్లో ఉన్న లోపాలను సవరించుకునే వీలుంటుందన్నారు. అనంతరం రైతులతో మాట్లాడి ముసాయిదా పట్టాదారుపాస్తుకం అందించారు. తొలుత ముప్పాళ్ళలోని తహసీల్దార్ కార్యాలయాన్ని సందర్శించారు. సత్తెనపల్లి ఆర్డీఓ రమణకాంత్‌రెడ్డి, తహసీల్దార్ కె.నగేష్, రెవెన్యూ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.


