● రూ.25 వేలు ఖర్చు అయ్యే పనికి రూ.1.50 లక్షల వరకు చెల్
● రూ.25 వేలు ఖర్చు అయ్యే పనికి రూ.1.50 లక్షల వరకు చెల్లింపు ● జీబ్రా గుర్తుల్లో మున్సిపల్ అధికారుల చేతివాటం ● నెలరోజుల కిందట మల్లమ్మసెంటర్‌లో ట్రాఫిక్ సిగ్నల్ కు నాలుగువైపులా రోడ్డుపై తెలుపు రంగుతో జీబ్రా పెయింట్ లైన్లు వేశారు. వాస్తవానికి ఈ లైన్లుకు రూ.25 వేలు లేదా రూ.30వేలకు మించి ఖర్చుకాదని కాంట్రాక్టర్లు చెబుతున్నారు. అయితే అధికారులు ఈ పనికి రూ.1.50లక్షలు నిధులు డ్రా చేశారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి.
● నెలరోజుల కాలానికే ఆ జీబ్రా గుర్తులు వెలవెల బోవటం గమనార్హం..
● తక్కువ ఖర్చుతో పనులు చేసి ఎక్కువ బిల్ పెట్టడంపై మహిళా ఇంజినీర్ అభ్యంతరం వ్యక్తం చేసినట్లు తెలిసింది.
● మున్సిపల్ డీఈ మహమద్ రఫీక్‌ను వివరణ కోరగా గుంటూరు, విజయవాడ, ఒంగోలులో అమలుచేసిన ఎస్‌ఎస్‌ఆర్ రేట్ల ప్రకారం ఎస్టిమేషన్ వేసి పనులు చేయించాం.
● చేతులతో పెయింట్ వేయకుండా విజయవాడ నుంచి మెషీన్ తెప్పించి స్వ్కేర్ ఫీట్‌కు రూ.800లు, జీఎస్‌టీతో కలిపి రూ.1.5లక్షల ఖర్చుతో జీబ్రా గుర్తులు వేయించాం.
● ప్రతిరోజూ ఆ ట్రాఫిక్ సిగ్నల్స్ వద్ద 85వేల వాహనాలు రాకపోకలు సాగిస్తాయని, దీని వల్ల వేసిన జీబ్రా పెయింటింగ్ మసకబారిందని పేర్కొన్నారు. తాము చేసిన పనిలో ఎటువంటి అవకతవకలు జరగలేదని తెలిపారు.
ప్రజా సొమ్ము గోల్‌మాల్
నరసరావుపేట: పురపాలక సంఘంలో అవినీతి ఛాయలు కనిపిస్తున్నాయి. వార్డుల వారీగా ప్రజాప్రతినిధుల పర్యవే క్షణ, ప్రశ్నించేందుకు కౌన్సిల్ లేకపోవటంతో అధికారులు తమ ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారనే ఆరోపణలు వి నిపిస్తున్నాయి. ఇటీవలనే మెప్మాలో ఫేక్ గ్రూపులు సృష్టించి సుమారు రూ.20 కోట్లు వరకు బ్యాంకు రుణాలు దిగమింగిన ఉదంతం బయటకు రావటంతో విచారణ జరుగుతుంది. కాగా, చిన్న పనులు చేసి పెద్ద మొత్తంలో ప్రజాసొమ్ము కాజేసిన ఉదంతం మరొకటి బయటపడింది.