సత్తెనపల్లి నియోజకవర్గానికి చెందిన ఇద్దరు షాడో ఎమ్మెల్య
అనుమతి ఉన్న చోటే మైనింగ్...
త్రిపురాపురం కొండల్లో భారీగా అక్రమ మట్టి తవ్వకాలు టీడీపీ నేతల జేబులు నింపుతున్న ఎర్ర మట్టి మైనింగ్ కనుమరుగవుతున్న త్రిపురాపురం కొండ అనుమతి ఆరు హెక్టార్లకు.. తవ్వుతున్నది మరో చోట రోడ్డు పనుల పేరుతో ఎర్ర మట్టి అమ్మకాలు నిత్యం పదుల సంఖ్యలో తిరుగుతున్న టిప్పర్లు అక్రమ మైనింగ్ లేదంటున్న మైనింగ్, రెవెన్యూ అధికారులు
మైనింగ్‌కు అనుమతులు ఉన్నాయి
అనుమతి ఆరు హెక్టార్లకే...
త్రిపురాపురం కొండ వద్ద మైనింగ్‌కు అనుమతి ఉంది. అనుమతి ఉన్న చోటే తవ్వకాలు చేపట్టాలి. వేరేచోట మైనింగ్ జరుగుతున్నట్టు తేలితే చట్టపరమైన చర్యలు తీసుకుంటాం. అక్రమ మైనింగ్‌ను ఉపేక్షించం.
– నాగయ్య,
మైనింగ్ శాఖ ఏడీ, పల్నాడు జిల్లా
సాక్షి, నరసరావుపేట: పల్నాడు జిల్లా నకరికల్లు మండలం త్రిపురాపురం కొండలో విలువైన ఎర్రని గ్రావెల్ ఉంది. ఈ మట్టి గట్టిగా ఉంటుందని ఎక్కువగా ఇళ్ల నిర్మాణాల బేస్ మట్టం కోసం వినియోగిస్తారు. మరోవైపు రియల్ ఎస్టేట్ వెంచర్లలో పైపొరగా వేసి ప్లాట్లను అందంగా తయారు చేస్తారు. దీంతో పాటు గార్డెన్‌లకు వినియోగిస్తారు. ఈ మట్టి మాఫియాకు వరంగా మారింది. త్రిపురాపురం కొండ పరిసరాల్లో గతంలో ఉన్న మైనింగ్ అనుమతులు అడ్డుపెట్టుకొని హద్దూ అదుపు లేకుండా తవ్వకాలు జరుపుతున్నారు. భారీ పొక్లయినర్లు వినియోగించి రూ.కోట్ల విలువైన ఎర్రమట్టిని టిప్పర్‌లలో తరలిస్తున్నారు. ప్రభుత్వ అభివృద్ధి పనుల పేరు చెప్పి
ఒకటి రెండు టిప్పర్‌లు అటు పంపి, పెద్ద సంఖ్యలో అమ్మకాలకు మట్టి తరలిపోతుంది. ట్రాక్టర్ మట్టి రూ.1,200లకు, ట్రిప్పర్ రూ.8 నుంచి రూ.9వేలకు విక్రయించి సొమ్ము చేసుకుంటున్నారు. ఈ తంతు గత కొన్ని నెలలుగా యథేచ్ఛగా సాగుతోంది.
ఇద్దరు షాడో ఎమ్మెల్యేల ఆధ్వర్యంలో...
త్రిపురాపురం వద్ద గల అన్‌సర్వే భూమిలో అక్రమ మట్టి తవ్వకాలు భారీగా చేపడుతున్నారు. అద్దంకి–నార్కెట్‌పల్లి జాతీయ రహదారికి ఆనుకొని ఉండడంతో రాత్రింబవళ్లు తరలిస్తున్నారు. రోజుకు 100కు పైగా టిప్పర్‌లలో తరలిపోతుంది. అనుమతులు ఒకచోట, తవ్వకాలు మరోచోట చేపడుతున్నా, యథేచ్ఛగా ప్రభుత్వ భూముల్లోని మట్టిని అమ్ముకుంటున్నా అడిగేవారే కరువయ్యారు. స్థానిక ప్రజాప్రతినిధి అండదండలతో సత్తెనపల్లి, నకరికల్లుకు చెందిన ఇద్దరు షాడో ఎమ్మెల్యేల ఆధ్వర్యంలో మట్టి తవ్వకాలు జరుగుతుండటంతో రెవెన్యూ, మైనింగ్ అధికారులు మిన్నకుండిపోయారు. నకరికల్లు మండలానికి చెందిన టీడీపీ రాష్ట్ర యువనేత మైనింగ్ మాఫియాలో ముఖ్యపాత్ర పోషిస్తున్నట్టు తెలుస్తోంది. స్థానిక అఽధికారులను బెదిరించి అక్రమ గ్రావెల్‌కు పాల్పడుతున్నాడు. రోడ్డు నిర్మాణ పనులకు వినియోగిస్తున్నామని ప్రారంభించి ఏకంగా సత్తెనపల్లి, నరసరావుపేట, పిడుగురాళ్ల ప్రాంతాల్లోని ప్రైవేటు వ్యక్తులకు అమ్ముకొని సొమ్ము చేసుకుంటున్నారు. ఈ టిప్పర్లతో నిత్యం ప్రమాదాలు జరిగి ప్రాణాలు పోతున్నా అధికారులు పట్టించుకోవడం లేదు.
త్రిపురాపురం కొండ ప్రాంతంలోని అన్‌సర్వే ల్యాండ్‌లో మట్టి తవ్వకాలకు అనుమతులు ఉన్నాయి. అన్ సర్వే ల్యాండ్‌లో 15 ఎకరాలకు అనుమతులు ఉన్నాయి. అందులోనే మైనింగ్ జరుగుతోంది.
– కె.పుల్లారావు, తహసీల్దార్, నకరికల్లు
నిత్యం వందలాది టన్నుల మట్టి అక్రమంగా తరలిపోతున్నా.. రెవెన్యూ, మైనింగ్ అధికారులు మిన్నుకుండిపోతున్నారు. అధికారపార్టీ నాయకుల ఒత్తిడితో, కాసుల వర్షంతో అధికారులు అక్రమ మైనింగ్‌కు వత్తాసు పలుకుతున్నారన్న చర్చ జరుగుతోంది. ఈ ప్రదేశంలో మట్టి తవ్వకాలకు కేవలం ఆరు హెక్టార్లలోనే అనుమతి ఉంది. అయితే దీన్ని అసరాగా చేసుకున్న అక్రమార్కులు ఆరు హెక్టర్ల పక్కనే ఉన్న భూమిలో మట్టితవ్వకాలు జరుపుతున్నారు. మీడియాలో వార్తలు రాగానే అబ్బే మైనింగ్ సక్రమమేనంటూ అధికారులు పత్రికా ప్రకటనలు ఇచ్చి మభ్యపెడుతున్నారన్న వాదనలు వినిపిస్తున్నాయి.


