గుత్తికొండ కాలువలో పడి వ్యక్తి మృతి
ిపడుగురాళ్ల: ప్రమాదవశాత్తు గుత్తి కాలువలో పడి వ్యక్తి మృతి చెందగా.. అతని కుమార్తెను రైతులు కాపాడిన సంఘటన గురువారం చోటు చేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాల మేరకు... గుత్తికొండ గ్రామానికి చెందిన కొత్త శ్రీనివాసరావు(45) తన కుమార్తె కొత్త తేజస్వినిని తీసుకొని గుత్తికొండ బిలం వైపు బైక్‌పై వెళ్తు ఉండగా ప్రమాదవశాత్తు కొత్త శ్రీనివాసరావు, తేజస్వినిలు గుత్తికొండ కాలువలో పడిపోయారు. తేజస్విని నీళ్లపై కొట్టుకులాడుతుండగా గుత్తికొండ కాలువ వద్ద పొలాల్లో పనిచేసే కూలీలు గమనించి, వెంటనే కాల్వలోకి దూకి తేజస్వినిని బయటకు తీశారు. అయితే తండ్రి శ్రీనివాసరావు కోసం గాలించగా శవమై తేలుతూ ఉండటంతో స్థానికులు గమనించి అతని మృతదేహాన్ని బయటకు తీశారు. ఈ సంఘటనపై పట్టణ పోలీస్ స్టేషన్‌లో ఎలాంటి కేసు నమోదు కాలేదు.
కొట్టుకుపోతున్న మృతుడి కుమార్తెను
కాపాడిన కూలీలు
గుత్తికొండ కాలువలో పడి వ్యక్తి మృతి


