రోడ్డు ప్రమాదంలో యువకుడు మృతి
దాచేపల్లి: కారు ఢీకొని యువకుడు మృతిచెందిన సంఘటన బుధవారం రాత్రి నడికుడి వ్యవసాయ మార్కెట్ వద్ద జరిగింది. సేకించిన వివరాల ప్రకారం.. దాచేపల్లికి చెందిన తాటిపర్తి శ్రీనివాసరెడ్డి కుమారుడు విజయ్‌కుమార్‌రెడ్డి(27) ఓ ఫర్టిలైజర్ కంపెనీలో పని చేస్తున్నాడు. బుధవారం రాత్రి 10:30 గంటల సమయంలో నడికుడి వ్యవసాయ మార్కెట్‌యార్డు వద్ద ద్విచక్రవాహనంతో రోడ్డు దాటుతున్న క్రమంలో గుంటూరు వైపు నుంచి తెలంగాణ వైపు అతివేగంతో వెళ్తున్న కారు ఢీకొట్టింది. ఈ ఘటనలో విజయ్‌కుమార్‌రెడ్డి తీవ్రంగా గాయపడి అక్కడికక్కడే మృతిచెందాడు. ప్రమాదం జరిగిన సమయంలో కారు నడుపుతున్నవారు మద్యం సేవించినట్లుగా స్థానికులు గుర్తించారు. సంఘటన స్థలాన్ని పోలీసులు పరిశీలన చేసి మృతదేహాన్ని పోస్ట్‌మార్టం నిమిత్తం మృతదేహాన్ని గురజాల ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. మృతుడి కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. విజయ్‌కుమార్‌రెడ్డి అవివాహితుడు. మృతుడు విజయ్‌కుమార్‌రెడ్డి వైఎస్సార్ సీపీలో చురుగ్గా పని చేశాడు. పార్టీ తరఫున చేపట్టే కార్యక్రమాల్లో పాల్గొనేవారు. విజయ్‌కుమార్‌రెడ్డి మృతిపట్ల స్థానిక వైఎస్సార్ సీపీ నేతలు సంతాపం వ్యక్తం చేశారు. మృతదేహాన్ని సందర్శించి నివాళులర్పించారు. అందరితో కలివిడిగా ఉండే విజయ్‌కుమార్‌రెడ్డి మృతితో దాచేపల్లిలో విషాదఛాయలు అలుముకున్నాయి.


