‘క్లెసా’ జిల్లా అధ్యక్షుడిగా లక్ష్మీకాంత్‌ | - | Sakshi
Sakshi News home page

‘క్లెసా’ జిల్లా అధ్యక్షుడిగా లక్ష్మీకాంత్‌

Sep 29 2025 8:12 AM | Updated on Sep 29 2025 8:12 AM

‘క్లెసా’ జిల్లా అధ్యక్షుడిగా లక్ష్మీకాంత్‌

‘క్లెసా’ జిల్లా అధ్యక్షుడిగా లక్ష్మీకాంత్‌

నూతన కార్యవర్గాన్ని ఏకగ్రీవంగా ఎన్నుకున్న సభ్యులు

నరసరావుపేట: కాన్ఫిడరేషన్‌ ఆఫ్‌ లైసెన్స్‌డు ఇంజినీర్స్‌, సర్వేయర్స్‌, అండ్‌ ఆర్కిటెక్ట్స్‌ ఆఫ్‌ ఏపీ (క్లెసా–ఏపీ) పల్నాడు జిల్లా నూతన కమిటీ ఏకగ్రీవంగా ఎన్నికై ంది. ఆదివారం స్థానిక ఇండియన్‌ మెడికల్‌ అసోసియేషన్‌ (ఐఎంఏ) భవనంలో క్లెసా ఏపీ ఆధ్వర్యంలో నిర్వహించిన పల్నాడు చాప్టర్‌ నూతన కమిటీ ఆవిష్కరణకు గౌరవ చైర్మన్‌ వేల్పుల రాము, చైర్మన్‌ ముని శ్రీనివాసరావు, ప్రెసిడెంట్‌ కొమ్మసాని కమలాకరరెడ్డి, జనరల్‌ సెక్రటరీ ఎన్‌.ఎన్‌.వి.ఎస్‌.ఎస్‌.మూర్తి, ఆర్గనైజింగ్‌ సెక్రటరీ రేజేటి సతీష్‌కుమార్‌ ముఖ్యఅతిధులుగా హాజరయ్యారు. వీరి సమక్షంలో నూతన కార్యవర్గాన్ని ప్రకటించారు. జిల్లా గౌరవ చైర్మన్‌గా కె.కమలాకరరెడ్డి, చైర్మన్‌గా ఎం.మురళీకృష్ణ, ప్రెసిడెంట్‌గా ఎస్‌.లక్ష్మీకాంత్‌, కోశాధికారిగా డి.రాజశేఖర్‌రెడ్డి, ఉపాధ్యక్షులుగా మీసా శ్రీనివాసరావు, బి.నరేంద్ర, ప్రధాన కార్యదర్శిగా డేవిడ్‌ కృపానందం, సంయుక్త కార్యదర్శులుగా మారెళ్ల రామాంజనేయులు, తోట సాంబశివరావు, ఆర్గనైజింగ్‌ కార్యదర్శిగా బి.వెంకటనారాయణరావు, ఈసీ సభ్యులుగా పి.నిర్మల్‌కుమార్‌, డీవీ కృష్ణారావు, పి.శ్యాంప్రసాద్‌, వి.శ్రీనివాసరావు, నుసి నాగఫణింద్రారెడ్డి, పి.కోటిరెడ్డి, అమర్‌లను ఎన్నుకున్నారు. ఈసందర్భంగా నూతన అధ్యక్షుడు సిరివేరి లక్ష్మీకాంత్‌ మాట్లాడుతూ సంఘం సంక్షేమం, టెక్నికల్‌ సెమినార్లు, సమస్యల పరిష్కారం కోసం కృషిచేస్తామని హామీ ఇచ్చారు. చిలకలూరిపేట, నరసరావుపేట, సత్తెనపల్లి, వినుకొండ, పిడుగురాళ్ల, దాచేపల్లి ప్రాంతాల ఇంజినీర్లు పెద్దఎత్తున పాల్గొన్నారు. తొలుత కార్యక్రమాన్ని జ్యోతి ప్రజ్వలనతో శ్రీకారం చుట్టారు. మ్యాక్స్‌ విజన్‌ కంటి హాస్పిటల్‌ డాక్టర్‌ రామలింగారెడ్డి ఆధ్వర్యంలో ఉచిత నేత్ర పరీక్షలు నిర్వహించారు. అలాగే ఇంజినీర్స్‌ వృత్తిలో ఎదురవుతున్న పలు సమస్యలపై చర్చించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement