
ఎత్తిపోతలకు భారీ జలకళ
విజయపురిసౌత్: మాచర్ల మండలంలోని ఎత్తిపోతల జలపాతానికి భారీగా వర్షం నీరు వచ్చి చేరటంతో శుక్రవారం జలకళతో కళకళలాడుతోంది. నాలుగు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాల వల్ల మాచర్ల పట్టణంలోని చంద్రవంకవాగు, భైరవునిపాడు, తాళ్లపల్లి చెరువులు, ఎత్తిపోతల చుట్టూ ఉన్న అన్నీ చెరువులకు నీరు అధికంగా రావటంతో ఆ నీరంతా ఎత్తిపోతలకు తరలివస్తోంది. ఎత్తిపోతల జలపాతం ప్రస్తుతం కురుస్తున్న వర్షాలతో 70 అడుగుల ఎత్తు నుంచి జాలువారుతున్న సుందరమైన నీటి దృశ్యాలు పర్యాటకులను ఆకట్టుకుంటున్నాయి. భారీ వర్షాలను సైతం లెక్క చేయకుండ పర్యాటకులు ఎత్తిపోతల అందాలను తిలకించేందుకు భారీగా తరలి వస్తున్నారు.