
నేటి అలంకారం శ్రీ కాత్యాయనీ దేవి
ఉత్సవాల్లో భాగంగా 4వ రోజు దుర్గమ్మ శ్రీ కాత్యాయనీదేవి అలంకారంలో భక్తులకు దర్శనమిస్తారు. పూర్వం కత అనే మహర్షికి దేవీ ఉపాసన వల్ల ఒక కుమారుడు కలిగాడు. చిన్నతనం నుంచే తండ్రి నుంచి భక్తిని అలవర్చుకున్న ఆ తపస్వికి కాత్యాయనుడు అనే పేరు. ఇతను దేవీ భక్తుడు అవ్వడంతో దేవీనే పుత్రికగా పొందదలచి గొప్ప తపస్సు చేశాడు. దేవీ ప్రసన్నురాలై మహర్షికి పుత్రికగా జన్మించింది. కాత్యాయనుడి పుత్రిక కనుక ఆ తల్లిని కాత్యాయనీదేవిగా కొలుస్తారు. కాత్యాయనీదేవిని ఆరాధించడం వల్ల చతుర్విధ పురుషార్థాలు సిద్ధిస్తాయి. రోగం, శోకం, భయం నశిస్తాయి. ఆయురారోగ్యాలు, సుఖ సంతోషాలు ఇంట వర్దిల్లుతాయి.