
ఆసియా అక్వాటిక్ పోటీలకు పరిశీలకునిగా సురేష్
నరసరావుపేట ఈస్ట్: శ్రీసుబ్బరాయ అండ్ నారాయణ కళాశాల స్విమ్మింగ్ పూల్ కోచ్ జి.సురేష్‌కు అరుదైన గౌరవం లభించింది. ఈనెల 28వ తేదీ నుంచి ప్రారంభం కానున్న 11వ ఆసియా అక్వాటిక్ చాంపియన్‌షిప్ పోటీలకు భారతదేశం తరపున టెక్నికల్ ఆఫీషియల్‌గా ఎంపికయ్యారు. పోటీలు ఈనెల 28 నుంచి అక్టోబర్ 10వ తేదీ వరకు గుజరాత్‌లోని అహ్మదాబాద్‌లో నిర్వహించనున్నట్టు సురేష్ బుధవారం తెలిపారు. ఆసియాలోని దాదాపు 30 దేశాలకు చెందిన స్విమ్మర్లు స్విమ్మింగ్, డైవింగ్, వాటర్ పోలో, సింక్రాన్డ్‌స్ తదితర విభాగాలలో పోటీ పడనున్నారు. భారతదేశం నుంచి సురేష్ గతంలో ఆఫ్రో– ఆసియన్ గేమ్స్, వరల్డ్ మిలటరీ గేమ్స్, ఆసియా ఏజ్ గ్రూప్ చాంపియన్‌షిప్, నేషనల్ చాంపియన్‌షిప్ వంటి జాతీయ, అంతర్జాతీయ స్విమ్మింగ్ పోటీలకు టెక్నికల్ అఫీషియల్‌గా వ్యవహరించారు. పల్నాడు జిల్లా స్విమ్మింగ్ అసోసియేషన్ అధ్యక్షుడు డాక్టర్ ఏ.ఏ.రామలింగారెడ్డి, కార్యదర్శి వై.వి.సుబ్బారెడ్డి, కళాశాల పాలకవర్గ అధ్యక్ష్య, కార్యదర్శులు కపలవాయి విజయకుమార్, నాగసరపు సుబ్బరాయగుప్త, ప్రిన్సిపల్ డాక్టర్ ఎం.ఎస్.సుధీర్, వైస్‌ప్రిన్సిపల్ డాక్టర్ పి.శ్రీనివాససాయి తదితరులు స్విమ్మింగ్ కోచ్ సురేష్‌ను అభినందించారు.