
అధికార దుర్వినియోగానికి పాల్పడుతున్న ప్రభుత్వం
ప్రజా ప్రయోజనాలతో వార్తలు ప్రచురించినప్పుడు అధికార పార్టీకి మద్దతుగా లేకపోతే సంబంధిత విలేకరులపై కేసులు పెట్టడం అధికార దుర్వినియోగం అవుతుంది. ప్రజా ప్రయోజనాలతో ఎలాంటి వార్తలనైనా ప్రచురించే హక్కు పత్రికలకు ఉంటుంది. అలాంటి స్వేచ్ఛను అణచివేయడం దారుణమైన విషయం. విలేకరులపై కేసులు పెట్టడం, వారి కుటుంబాలను వేధించడం ఏ ప్రభుత్వానికై నా సరైన పద్ధతి కాదు. పత్రికా స్వేచ్ఛను అడ్డుకునే అధికారాన్ని రాజ్యాంగం ఎవరికీ కట్టబెట్టలేదు. స్వాతంత్య్ర పోరాటానికి ముందు నుంచి గళమెత్తిన పత్రికలు.. ఎన్నో అన్యాయాలను ఎదిరించి రాశాయి. అధికారాలను మార్చాయి. విలేకరులపై తప్పుడు కేసులు పెట్టే సంస్కృతిని ఎవరైనా ఖండించాల్సిందే.
– మెరుగుపాల రాజారత్నం, సీనియర్ జర్నలిస్ట్

అధికార దుర్వినియోగానికి పాల్పడుతున్న ప్రభుత్వం

అధికార దుర్వినియోగానికి పాల్పడుతున్న ప్రభుత్వం