ప్రైవేటుపరం ఓ పెద్ద స్కామ్‌ | - | Sakshi
Sakshi News home page

ప్రైవేటుపరం ఓ పెద్ద స్కామ్‌

Sep 20 2025 7:04 AM | Updated on Sep 20 2025 7:04 AM

ప్రైవేటుపరం ఓ పెద్ద స్కామ్‌

ప్రైవేటుపరం ఓ పెద్ద స్కామ్‌

● ఏడాదికి రూ.600 కోట్లు చొప్పున రూ.2400 కోట్ల అక్రమ ఆదాయం ● పార్టీ కార్యాలయంలో మీడియాతో డాక్టర్‌ గోపిరెడ్డి

నరసరావుపేట: రాష్ట్రంలో మెడికల్‌ కళాశాలలు ప్రైవేటు పరం చేయటంలో పెద్ద స్కామ్‌ దాగి ఉందని, దీనికి చంద్రబాబు, లోకేష్‌లు తెరతీసారని వైఎస్సార్‌సీపీ జిల్లా కార్యనిర్వాహక అధ్యక్షులు, మాజీ ఎమ్మెల్యే డాక్టర్‌ గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి విమర్శించారు. పార్టీ కార్యాలయంలో శుక్రవారం నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. మెడికల్‌ కళాశాలల ప్రైవేటుపరం కేవలం లంచాల కోసం తన చంచాలకు అప్పచెప్పే ప్రయత్నమని పేర్కొన్నారు. దీని వలన మేనేజ్‌మెంట్‌ కోటా కింద ఒక్కో సీటు రూ.2కోట్లకు అమ్ముకుంటారని, సుమారుగా 300 సీట్లతో ఏడాదికి రూ.600 కోట్లు ఆదాయం వస్తుందన్నారు. వచ్చే నాలుగేళ్లలో రూ.2400 కోట్లు దోచిపెట్టే ప్రయత్నమే ఈ మెడికల్‌ కళాశాల వ్యవహారమని అన్నారు. తనకు అధికారం అప్పగిస్తే సంపద సృషి్‌ాట్స్తనన్న చంద్రబాబు జగనన్న సృష్టించిన సంపద అమ్ముతూ రాష్ట్రంలో విధ్వంస పాలన చేస్తున్నాడని విమర్శించారు. చంద్రబాబుది సుపరిపాలన కాదని విధ్వంసపాలనగా అభివర్ణించారు. ప్రజలు అసహ్యించుకుంటున్నారని,. రాష్ట్రంలో ప్రజాస్వామ్యం కరువైందన్నారు. గత ప్రభుత్వంలో వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ప్రారంభించిన మెడికల్‌ కాలేజీల నిర్మాణాలను పూర్తిచేసి ప్రజలకు అప్పచెప్పకుండా పప్పుబెల్లాల్లా అమ్ముకుంటున్నారన్నారు. దీనిపై వైఎస్సార్‌సీపీ చేపట్టిన చలో మెడికల్‌ కాలేజీ కార్యక్రమం ద్వారా ఈ గుడ్డి ప్రభుత్వానికి తెలియచెప్పేందుకు ప్రయత్నిస్తున్న తమను హౌస్‌ అరెస్టు చేయటమేమిటని ప్రశ్నించారు. పార్టీ సమన్వయకర్తలైన తనతోపాటు పిన్నెల్లి రామకృష్ణారెడ్డి, విడదల రజిని, డాక్టర్‌ గజ్జల సుధీర్‌భార్గవరెడ్డి, నంబూరు శంకరరావు, బొల్లా బ్రహ్మనాయుడులను హౌస్‌ అరెస్టు చేశారన్నారు. హైదరాబాదు నుంచి కార్యక్రమానికి తరలివస్తున్న కాసు మహేష్‌రెడ్డిని మిర్యాలగూడ వద్ద అరెస్టు చేయటం దారుణమని అన్నారు. పిడుగురాళ్లలోని మెడికల్‌ కాలేజీ 80శాతం పూర్తయిందని, 90 శాతం వైద్యశాల పూర్తయిందన్నారు. కేవలం పది శాతం పూర్తిచేస్తే ప్రారంభించవచ్చన్నారు. 2019కు ముందు కేవలం 11 మెడికల్‌ కళాశాలలు బాబు కట్టిస్తే జగన్‌మోహన్‌రెడ్డి ఐదేళ్లలో 17 కళాశాలల నిర్మాణం చేపట్టారన్నారు. ఉత్తరప్రదేశ్‌లో 75మెడికల్‌ కళాశాల నిర్మాణాలను ఆ రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిందన్నారు. మెడిసిన్‌ చదివేందుకు తల్లిదండ్రులు తమ పిల్లలను ఫిలిఫ్‌పైన్స్‌, కిర్గిస్తాన్‌ లాంటి విదేశాలకు పంపిస్తున్నారని చెప్పారు. 2023–24 నాటికి ఐదు మెడికల్‌ కళాశాలలు పూర్తిచేసి ప్రారంభించారని, దీని వలన అదనంగా రాష్ట్రానికి 750 సీట్లు కలిసి వచ్చాయన్నారు. వచ్చే 2029 నాటికి మరో నాలుగు మెడికల్‌ కళాశాలలు సిద్ధమౌతాయ న్నా రు. కూటమి ప్రభుత్వం రాగానే పనులు ఆపేస్తూ జీఓ జారీచేసిందన్నారు. జగన్‌పై కోపంతో పులివెందులలో సీట్లు వద్దని నేషనల్‌ మెడికల్‌ కౌన్సిల్‌కు లేఖ రాశారన్నారు. పది మెడికల్‌ కళాశాలలను పబ్లిక్‌ ప్రైవేటు పార్టనర్‌షిప్‌ (పీపీపీ) పద్ధతిలో అప్పచెప్పేందుకు టెండర్లు ఆహ్వానించిందని, కేవలం సింగిల్‌ టెండర్‌దారు వచ్చినా అప్పచెప్పే విధంగా నిబంధనలు సవరించారని, ఇది పెద్ద స్కామ్‌గా ఆయన అభివర్ణించారు. కేవలం 16 నెలల్లో రూ.2 లక్షలకోట్లు అప్పుచేసిన కూటమి ప్రభుత్వం రూ.5500 కోట్లతో మెడికల్‌ కళాశాలలను పూర్తి చేయలేరా అని ప్రశ్నించారు. ఆరోగ్యశ్రీ ఇన్స్యూరెన్స్‌ కంపెనీకి ధారాదత్తం చేస్తున్నారన్నారు.

ఈ రాష్ట్రంలో వనరులని ప్రైవేటు వ్యక్తులకు అప్పజెప్పి కోట్లకు కోట్లు దోచుకునే కార్యక్రమం చేస్తున్న చంద్రబాబు, లోకేష్‌ల దుర్మార్గపు కార్యక్రమాలను అడ్డుకుంటామని హెచ్చరించారు. తమ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే మెడికల్‌ కళాశాలల ప్రైవేటీకరణ ఒప్పందాన్ని రద్దు చేస్తామని హెచ్చరించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement