
యెనుముల హౌస్ అరెస్టు
గురజాల: వైఎస్సార్ సీపీ రాష్ట్ర కార్యదర్శి, పెదకూరపాడు–వినుకొండ నియోజవర్గాల పరిశీలకులు యెనుముల మురళీధర్‌రెడ్డితో పాటు పలువురు వైఎస్సార్ సీపీ నాయకులు, కార్యకర్తలు మెడికల్ కళాశాల వద్ద శాంతియుత ఽనిరసన చేయకుండా పోలీసులు అడ్డుకున్నారు. వారిని హౌస్ అరెస్టు చేశారు.
23న సంఘం శరణం గచ్చామి నాటక ప్రదర్శన
సత్తెనపల్లి: పట్టణంలోని లూథరన్ చర్చి ప్రాంగణంలో ఈనెల 23న సాయంత్రం ఆరు గంటలకు ఏపీ వ్యవసాయ కార్మిక సంఘం పల్నాడు జిల్లా కమిటీ ఆధ్వర్యంలో సంఘం శరణం గచ్చామి 769వ నాటక ప్రదర్శన జరుగుతుందని సంఘం జిల్లా కార్యదర్శి జి రవిబాబు శుక్రవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. తెలిపారు. అభ్యుదయ ఆర్ట్స్ అకాడమీ హైదరాబాద్ వారు ప్రదర్శిస్తారని తెలిపారు.
జిల్లాలో 362.6 మిల్లీమీటర్ల వర్షం
నరసరావుపేట: జిల్లాలో గడిచిన 24గంటల వ్యవధిలో 362.6 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైందని అధికారులు శుక్రవారం పేర్కొన్నారు. ఐదు మండలాలు మినహా 23మండలాల్లో వర్షం నమోదైంది. అత్యధికంగా అమరావతి మండలంలో 52.6 మి.మీ వర్షం పడగా అత్యల్పంగా రాజుపాలెంలో 1.0 కురిసింది. మాచర్ల 4.2, వెల్దుర్తి 15.2, దుర్గి 42.2, రెంటచింతల 20.2, గురజాల 27.2, దాచేపల్లి 12.0, కారంపూడి 7.4, పిడుగురాళ్ల 24.2, మాచవరం 4.2, బెల్లంకొండ 9.6, అచ్చంపేట 40.2, క్రోసూరు 16.0, పెదకూరపాడు 5.0, సత్తెనపల్లి 10.4, బొల్లాపల్లి 6.2, వినుకొండ 12.8, నూజెండ్ల 28.2, శావల్యాపురం 2.4, నాదెండ్ల 5.4, చిలకలూరిపేట 13.8, యడ్లపాడు 2.2 మి.మీ వర్షం కురిసింది.
టెయిల్ పాండ్ ప్రాజెక్టును సందర్శించిన కేఆర్‌ఎంబీ చైర్మన్
సత్రశాల(రెంటచింతల): నాగార్జునసాగర్ టెయిల్‌పాండ్ విద్యుత్ ప్రాజెక్టును, పవర్ హౌస్‌ను కృష్ణా నదీ జలాల బోర్డు చైర్మన్ బీపీ పాండే శుక్రవారం ఆకస్మికంగా సందర్శించి పరిశీలించారు. కమిటీ సభ్యులు కమల్, ఏపీ జెన్‌కో ఏసీ వెంకట రమణ, శ్రీనివాసులు, ఈఈ సుబ్రమణ్యం పాల్గొన్నారు.