
అంగన్‌వాడీలకు కనీస వేతనాలు ఇవ్వాలి
సత్తెనపల్లి: ఏపీ అంగన్‌వాడీ వర్కర్లు, హెల్పర్లను ప్రభుత్వం కార్మికులుగా గుర్తించి కనీస వేతనం ఇవ్వాలని, అలాగే ప్రభుత్వ సంక్షేమ పథకాలను వర్తింప చేయాలని ఏపీ అంగన్‌వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ పల్నాడు జిల్లా కార్యదర్శి ఎస్.ఆంజనేయులునాయక్ డిమాండ్ చేశారు. సత్తెనపల్లి పట్టణంలోని పుచ్చలపల్లి సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో గురువారం యూనియన్ పల్నాడు జిల్లా ద్వితీయ మహాసభ నిర్వహించారు. ఆంజనేయులు నాయక్ మాట్లాడుతూ ప్రభుత్వ వేధింపులు ఆపాలని, నెట్‌వర్క్ స్పీడ్ పెంచాలని, యాప్‌ల భారాన్ని తగ్గించాలని, సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం అంగన్‌వాడీలను కార్మికులుగా గుర్తించి గ్రాడ్యుటీ అమలు చేయాలని డిమాండ్ చేశారు. అనంతరం యూనియన్ జిల్లా ప్రధాన కార్యదర్శి గుంటూరు మల్లేశ్వరి మూడు సంవత్సరాల కార్యకలాపాల రిపోర్టును సభలో ప్రవేశపెట్టారు. సమస్యలపై పలు తీర్మానాలను ప్రతినిధులందరూ ఏకగ్రీవంగా ఆమోదించారు. ముందుగా యూనియన్ పతాకాన్ని జిల్లా అధ్యక్షురాలు మెట్టిల్లా దేవి ఆవిష్కరించారు.
అనంతరం జిల్లా ఉపాధ్యక్షురాలు ప్రసన్న విధుల్లో మరణించిన వర్కర్లకు, హెల్పర్లకు సంతాపం ప్రకటిస్తూ నివాళులర్పించారు. కార్యక్రమంలో కౌలు రైతు సంఘం జిల్లా ఉపాధ్యక్షుడు పెండ్యాల మహేష్, మహిళా సంఘం జిల్లా కార్యదర్శి గుంటుపల్లి రజని, రాష్ట్ర కమిటీ సభ్యురాలు గద్దె ఉమశ్రీ, సీఐటీయూ పట్టణ నాయకులు ఎం హరిపోతురాజు, జడ రాజ్‌కుమార్, సత్తెనపల్లి ప్రాజెక్ట్ అధ్యక్ష, కార్యదర్శులు సుజాత, అహల్య, క్రోసూర్ ప్రాజెక్ట్ కార్యదర్శి జయలక్ష్మి, జిల్లా వ్యాప్తంగా అన్ని ప్రాజెక్టులు నుంచి పలువులు
అంగన్‌వాడీ వర్కర్లు, హెల్పర్లు ప్రతినిధులు, తదితరులు పాల్గొన్నారు.
అధ్యక్షకార్యదర్శులుగా ప్రసన్న, శాంతమణి
ఏపీ అంగన్‌వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ (సీఐటీయూ) పల్నాడు జిల్లా అధ్యక్షురాలుగా ఏఎల్ ప్రసన్న ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. గౌరవ అధ్యక్షురాలుగా గుంటూరు మల్లేశ్వరి, కార్యదర్శిగా శాంతమణి, కోశాధికారిగా మాధవితోపాటు మరో 20 మందితో నూతన జిల్లా కమిటీని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు.

అంగన్‌వాడీలకు కనీస వేతనాలు ఇవ్వాలి

అంగన్‌వాడీలకు కనీస వేతనాలు ఇవ్వాలి