యడ్లపాడుకు విచ్చేసిన హైకోర్టు న్యాయమూర్తి
యడ్లపాడు: హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ చల్లా గుణరంజన్ ఆదివారం యడ్లపాడును సందర్శించారు. స్థానిక విశ్రాంత దేవదాయ శాఖ డిప్యూటీ కమిషనర్ పోపూరి గంగయ్య చౌదరి నివాసానికి వెళ్లి గంగయ్య చౌదరి, భారతి దంపతులను మర్యాదపూర్వకంగా కలిశారు. కుటుంబ సభ్యులతో ఆత్మీయంగా ముచ్చటిస్తూ, వారి యోగక్షేమాలను అడిగి తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో న్యాయవాది రమణకృష్ణ, స్థానిక నారాయణ పాఠశాల ప్రిన్సిపల్ చెరుకూరి సృజన, డైరెక్టర్ పోపూరి వెంకటేశ్వర్లు (చిన్నా), పోపూరి రాఘవయ్య, పోపూరి వెంకటరత్తయ్య తదితరులు పాల్గొన్నారు.


