
నిరాధార వార్తలు పోస్టు చేస్తే కఠిన చర్యలు
గుంటూరు రూరల్: సామాజిక మాధ్యమాల్లో నిరాధార వార్తలను పోస్టు చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని, సౌత్ సబ్ డివిజన్ డీఎిస్పీ ఎ. భానోదయ తెలిపారు. ఆదివారం నగరంలోని తన కార్యాలయంలో డీఎస్పీ మాట్లాడారు. ప్రజా రిపోర్టర్ అనే వాట్సాప్ గ్రూప్‌లో 9640128296 అనే ఫోన్ నంబర్ కలిగిన వ్యక్తి గుంటూరు పోలీసుల అదుపులో దళిత జర్నలిస్టు? మూడు రోజులైనా ఇంకా కోర్టులో ప్రవేశపెట్టలేదని పోస్టును వైరల్ చేసినట్టు వివరించారు. వాస్తవానికి దళిత జర్నలిస్టులెవరినీ అరెస్టు చేయలేదని డీఎస్పీ వెల్లడించారు. తెలంగాణ రాష్ట్రం నుంచి అక్రమ మద్యం తెచ్చి విక్రయిస్తున్న కేసులో మార్చి 22న తెల్లవారు జామున కూరపాటి విజయ్ అనే వ్యక్తిని అరెస్టు చేసి, అదే రోజు మధ్యాహ్నం న్యాయస్థానంలో ప్రవేశపెట్టామని, అతనికి న్యాయమూర్తి రిమాండ్ విధించారని వెల్లడించారు. అసత్య పోస్టును పెట్టిన వ్యక్తిపై కచ్చితంగా కఠిన చర్యలు ఉంటాయని ఆమె హెచ్చరించారు.
సౌత్ డీఎస్పీ భానోదయ