బుధవారం శ్రీ 19 శ్రీ మార్చి శ్రీ 2025
నిత్యాన్నదానానికి విరాళం
ఇంద్రకీలాద్రి: దుర్గమ్మ సన్నిధిలో నిత్యాన్నదానానికి విజయవాడ భవానీపురానికి చెందిన కనమర్లపూడి రామకృష్ణ, సౌమిత్రి పద్మవల్లి రూ. 1,00,116 విరాళాన్ని అందజేశారు.
ఇఫ్తార్ సహర్
(బుధ) (గురు)
నరసరావుపేట 6.26 4.58
గుంటూరు 6.24 4.56
బాపట్ల 6.24 4.56
వినుకొండ: ఒంటరి మహిళలను టార్గెట్‌గా చేసుకొని దొంగతనాలకు పాల్పడుతూ ఎదురు తిరిగిన వాళ్లను చంపుతూ దొంగలు యథేచ్ఛగా హత్యాకాండ సాగిస్తున్నారు. వినుకొండకు గుండెకాయ లాంటి కొత్తపేట ప్రాంతంలో ఏడాది తిరగకుండానే ఇద్దరు వృద్ధ మహిళలను టార్గెట్‌గా చేసుకొని వారిని హతమార్చి, వారి ఒంటిపై ఉన్న బంగారం దోచుకెళ్లడం స్థానికంగా కలకలం రేపుతోంది. ఇద్దరినీ అత్యంత కిరాతకంగా చంపి బంగారాన్ని ఎత్తుకెళ్లడం గమనార్హం.
కలకలం రేపిన
సావిత్రి హత్య..
సోమవారం రాత్రి కొత్తపేటలో మెయిన్‌బజారులో వినాయకుడి గుడి వద్ద ఒంటరిగా ఉంటున్న కొప్పరపు సావిత్రి అనే 75 ఏళ్ల మహిళ ఇంట్లోకి పట్టపగలే ప్రవేశించిన దుండగులు ఆమెను హత్య చేసి ఆమె ఒంటిపై బంగారాన్ని దోచుకెళ్లారు. అలాగే ఇంట్లో టీవీ సౌండ్ పెంచి టీవీ చూస్తున్నట్టుగా భ్రమింపజేసి బయట తాళం వేసి పరారయ్యారు. స్కూల్‌కు వెళ్లి వచ్చిన ఆమె మనవరాలు ఎంతసేపటికీ పిలిచినా పలకక పోవడంతో స్థానికుల సాయంతో తలుపులు పగలగొట్టగా అప్పటికే సావిత్రి మృతి చెందినట్లు గుర్తించారు. రంగంలోకి దిగిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు.
గతేడాది ఇదే ప్రాంతంలో...
ఇదిలా ఉంటే.. గత ఏడాది జూన్ 19వ తేదీన ఇదే కొత్తపేట ప్రాంతంలో ఇంట్లో ఒంటరిగా ఉన్న పి.కోటిరత్నం అనే 75 ఏళ్ల వృద్ధురాలి మెడలో గొలుసు చోరీకి విఫలయత్నం చేసిన దొంగలు ఆమె ఎంతసేపటికీ గొలుసు వదలకపోవడంతో తలపై రాయితో కొట్టి హత్య చేసి పారిపోయారు. రెండు హత్యలు పట్టపగలే జరగడంతో ఆ ప్రాంతంలో మహిళలు భయాందోళనకు గురవుతున్నారు. అయితే కోటిరత్నం హత్య జరిగి ఏడాదికావస్తున్నా ఇప్పటికీ కేసు దర్యాప్తులో ఎలాంటి పురోగతి లేకపోవడం గమనార్హం.
నిందితుల ఆచూకీ కోసం గాలిస్తున్న పోలీసు జాగిలాలు
7
బంగారం కోసం మహిళలను హతమారుస్తున్న వైనం వినుకొండ కొత్తపేటలో ఏడాది కాలంలో ఇరువురు మహిళల హత్య ప్రభుత్వ చీఫ్ విప్ ఆంజనేయులు ఇంటి సమీపంలో ఘటనలు మహిళల భద్రత ప్రశ్నార్థకం ఆందోళన వ్యక్తం చేస్తున్న పట్టణ ప్రజలు
న్యూస్‌రీల్
జీవీ ఇంటికి కూత వేటు దూరంలోనే..
స్థానిక ఎమ్మెల్యే, ప్రభుత్వ చీఫ్ విప్ జీవీ ఆంజనేయులు ఇంటి సమీపంలోనే ఇలాంటి ఘటనలు జరుగుతుండడం భద్రత వైఫల్యాలకు అద్దం పడుతుంది. దొంగలు రాత్రిళ్లే కాకుండా పట్టపగలే ఇలాంటి దుర్ఘటనలకు పాల్పడుతుండడం పోలీసు వైఫల్యాలను ఎత్తి చూపుతోంది. డాగ్ స్క్వాడ్, సీసీ కెమెరాలు అత్యాధునిక సమాచార వ్యవస్థ ఉన్నప్పటికీ కేసుల దర్యా ప్తులో ఎలాంటి పురోగతి లేకపోవడం విచా రకరం. ఇప్పటికై నా పోలీసులు వేగవంతమైన దర్యాప్తు చేపట్టి మహిళల భద్రతపై నమ్మకం కలిగించాలని పట్టణ ప్రజలు కోరుతున్నారు.
పల్నాడు
పల్నాడు
పల్నాడు
పల్నాడు
పల్నాడు
పల్నాడు
పల్నాడు
పల్నాడు
పల్నాడు