సాక్షి స్పెల్‌బీ రాస్తున్న విద్యార్థులు
సాక్షి స్పెల్‌బీ, మాథ్స్‌బీ గ్రాండ్ సక్సెస్
● గుంటూరు నగరంలో ఉత్సాహంగా సెకండ్ లెవల్ పరీక్ష ● జిల్లా వ్యాప్తంగా వివిధ పాఠశాలల నుంచి హాజరైన విద్యార్థులు ● ఆంగ్ల భాషలో నైపుణ్యాల పెంపుదలకు స్పెల్‌బీ ● గణితంలో పట్టు సాధించేందుకు మ్యాథ్స్‌బీ
గుంటూరు ఎడ్యుకేషన్: విద్యార్థులను ఆంగ్లభాషలో ప్రావీణ్యులుగా, గణితంలో ప్రజ్ఞావంతులుగా తీర్చిదిద్దేందుకు ‘సాక్షి’ మీడియా గ్రూప్ ఆదివారం నిర్వహించిన స్పెల్‌బీ, మ్యాథ్స్‌బీ గ్రాండ్ సక్సెస్ అయ్యింది. పాఠశాలస్థాయిలో నిర్వహించిన మొదటి దశ పరీక్షలో ప్రతిభ చూపడం ద్వారా సెకండ్ సెవల్‌కు ఎంపికైన విద్యార్థులకు జిల్లాస్థాయిలో స్పెల్‌బీ, మ్యాథ్స్‌బీ పరీక్షలను గుంటూరు అమరావతిరోడ్డు ఆంజనేయపేటలోని విజేత ఐఐటీ ఫౌండేషన్ స్కూల్లో నిర్వహించారు. స్పెల్‌బీకి 107, మ్యాథ్స్‌బీకి 158 మంది చొప్పున మొత్తం 265 మంది హాజరయ్యారు. సాక్షి స్పెల్‌బీ, మ్యాథ్స్‌బీకి ప్రజెంటింగ్ స్పాన్సర్‌గా డ్యూక్స్ వ్యాఫీ, అసోసియేట్ స్పాన్సర్‌గా ట్రిప్స్ ఇంటర్నేషనల్ స్కూల్ వారు వ్యవహరిస్తున్నారు.
స్పెల్‌బీలో కఠినమైన ఆంగ్ల పదాలను విని, అక్షరాలతో పూరించి సులువుగా అర్థాలను వివరించేందుకు విద్యార్థులు పోటీపడ్డారు. అదే విధంగా గణితంలో క్లిష్టమైన లెక్కలను సులువుగా పరిష్కరించేందుకు ఉత్సాహం చూపారు. నిర్వాహకులు చక్కని ఏర్పాట్లు చేశారు. ఒకటో తరగతి నుంచి 10వ తరగతి వరకు విద్యార్థులను నాలుగు కేటగిరీలుగా విభజించి, ఆయా పాఠ్యాంశాల స్థాయిలో రూపొందించిన ప్రఊ్నపత్రాలతో వేర్వేరుగా నిర్వహించిన స్పెల్‌బీ, మ్యాథ్స్‌బీ విద్యార్థుల్లో భావ వ్యక్తీకరణ, గణితశాస్త్రంలో నైపుణ్యాలను వెలికితీసేందుకు దోహద పడింది. కాగా స్పెల్‌బీ, మ్యాథ్స్‌బీకి గుంటూరులోని కెనడీ స్కూల్, విజ్ఞాన్ హైస్కూల్, డాక్టర్ కేకేఆర్ గౌతమ్ స్కూల్, విజేత స్కూల్, వీవా ది స్కూల్‌తో పాటు నరసరావుపేటలోని లిటిల్ జెమ్స్ స్కూల్, వినుకొండలోని శర్మ స్కూల్ నుంచి విద్యార్థులు హాజరయ్యారు.
సాక్షి మ్యాథ్స్‌బీ రాస్తున్న చిన్నారులు
మ్యాథ్స్‌బీ రాస్తున్న విద్యార్థులు


