వైఎస్సార్ సీపీ జోనల్ ఇన్‌చార్జి పిన్నెల్లి వెంకట్రామిరెడ్డి
వెల్దుర్తి: వరికపూడిశెల కల సాకారం చేసేందుకు సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఈ నెల 15వ తేదీ మాచర్లకు వస్తున్నారని, ఆ కార్యక్రమాన్ని విజయవంతం చేద్దామని వైఎస్సార్ సీపీ మూడు జిల్లాల జోనల్ ఇన్‌చార్జి పిన్నెల్లి వెంకట్రామిరెడ్డి పిలుపునిచ్చారు. స్థానిక మండల పరిషత్ కార్యాలయంలో పార్టీ నాయకులతో సోమవారం సమావేశమయ్యారు. ఆయన మాట్లాడుతూ వరికపూడిశెల లిఫ్ట్‌ను ప్రభుత్వం మంజూరు చేసిందని చెప్పారు. ఎంతో కాలంగా పల్నాడు ప్రజలు ఎదురుచూస్తున్న కష్టాలు తీరనున్నాయని పేర్కొన్నారు. సీఎం జగన్‌కు ధన్యవాదాలు తెలిపేందుకు ప్రతి ఒక్కరూ కార్యక్రమానికి తరలిరావాలని కోరారు. సీఎం వైఎస్ జగన్ ఆధ్వర్యంలో నరసరావుపేట ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు, ప్రభుత్వ విప్ పిన్నెల్లి రామకృష్ణారెడ్డి అటవీ, పర్యావరణ అనుమతులు తీసుకొచ్చి రేపు శంకుస్థాపన చేసేందుకు తరలివస్తున్నార పేర్కొన్నారు. కార్యక్రమంలో జిల్లా ప్రధానకార్యదర్శి మేకల కోటిరెడ్డి, మాచర్ల మార్కెట్ యార్డు చైర్మన్ తాడి వెంకటేశ్వరరెడ్డి, మాజీ చైర్మన్ పల్లపాటి గురుబ్రహ్మం, మండల పరిషత్ అధ్యక్షులు చింతా శివరామయ్య, మండల పరిషత్ ఉపాధ్యక్షులు అలుగుమల్లి సంజీవరెడ్డి, జెడ్పీటీసీ సభ్యుడు రూప్లీ బాలునాయక్, మండ్లి పెద మల్లు స్వామి, పార్టీ మండల అధ్యక్షులు కోట్ల పాపిరెడ్డి, సర్పంచులు పిన్నెల్లి వెంకటరెడ్డి, పుల్లారెడ్డి, సైదారెడ్డి, పంగులూరి లక్ష్మయ్య, వైఎస్సార్ సీపీ నాయకులు కాంతారావు, గాలి వెంకటేశ్వర్లు, దేవిరెడ్డి శ్రీనివాసరెడ్డి, అయ్యన్న, ఏగయ్య, హనుమానాయక్, పిచ్చిరెడ్డి, నారాయణరెడ్డి, సబ్బసాని కోటిరెడ్డి, రవీంద్ర, యర్రబ్బాయ్, బలిగొడుగుల శ్రీనివాసరెడ్డి, లచ్చిరెడ్డి, అంజిబాబు, అంకిరెడ్డి, చింతా ఆదినారాయణ, తోట ఆంజనేయులు, నల్ల వెంకటరెడ్డి పాల్గొన్నారు.