జయపురం: అఖిల భారత ట్రేడ్ యూనియన్ కాంగ్రెస్(ఐఎన్‌టీయూసీ) నేతృత్వంలో పలు కార్మిక సంఘాల సభ్యులు స్థానిక డిప్యూటీ లేబర్ కమిషనర్ కార్యాలయం ఎదుట గురువారం ధర్నా నిర్వహించారు. కార్మికుల డిమాండ్ల సాధనకు చేపట్టిన ఈ ధర్నాలో రాష్ట్ర ముఖ్యమంత్రి, కార్మిక మంత్రికి సంబోధించిన లేఖలను డిప్యూటీ కమిషనర్‌కు అందజేశారు. ముఖ్యంగా రెండేళ్ల నుంచి మూతపడి ఉన్న జయపురం గగణాపూర్‌లోని సేవా పేపరు మిల్లును పునరుద్ధరించి పూర్తిస్థాయిలో నడపాలని, కార్మికుల జీతాలు, విశ్రాంత కార్మికుల బకాయిలు, గ్రాట్యుటీ, పీఎఫ్ తదితర సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో ఐఎన్‌టీయూసీ జిల్లా కార్యదర్శి జుధిష్టర్ రౌళో, పేపరు మిల్లు కార్మిక సంఘ అధ్యక్షుడు ప్రమోద్ కుమార్ మహంతి, ప్రధాన కార్యదర్శి ప్రదీప్ పాంజియ, కమ్యూనిస్టు పార్టీ జిల్లా కార్యదర్శి రామకృష్ణ దాస్ తదితరులు పాల్గొన్నారు.


