పర్లాకిమిడి: పట్టణంలోని 14వ వార్డు సన్నాయి నాయుడు వీధిలో మున్సిపల్ కౌన్సిల్ అధికారులు డ్రైనేజీ మరమ్మతులు చేపడుతున్నారు. ఇటీవల అర్నాబ్, ఆక్వాన్ తుపానుకు సన్నాయి నాయుడు వీధిలోని డ్రైనేజీలో చెత్త, మురికి నిలిచిపోయి రోడ్డు మీదకు రావడంతో డ్రైనేజీ పనులు చేపట్టాలని మున్సిపల్ కౌన్సిల్ నిర్ణయించింది. దాదాపు రూ.15 లక్షల వ్యయంతో సన్నాయినాయుడు వీధి ఎడమ వైపు డ్రైనేజీ నిర్మాణం చేపట్టడంతో బంగారం, వస్త్ర ఇతర వ్యాపారులు నిరసన వ్యక్తం చేస్తున్నారు. నాలుగు దశాబ్ధాల కాలం తర్వాత కాలం చెల్లిన డ్రైనేజీ నిర్మాణం వల్ల వాహనదారులకు ఉపయోగం ఉంటుందని పురపాలక ఇంజినీర్లు తెలియజేశారు.
సైబర్ నేరాలపై అవగాహన
పర్లాకిమిడి: స్థానిక శ్రీకృష్ణచంద్ర గజపతి స్వయం ప్రతిపత్తి కళాశాలలో ఆదర్శ పోలీసు ఠాణా సైబర్ క్రైమ్ ఆధ్వర్యంలో నిషాముక్త అభిమాన్, సైబర్ నేరాలపై గురువారం అవగాహన కల్పించారు. ఐఐసీ ప్రశాంత భూపతి, ప్రిన్సిపాల్ రాధాకాంత భుయ్యాన్, సీసీఈవో ఠాణా ఇన్‌స్పెక్టర్ టునా శోబోరోలు విద్యార్థులకు అవగాహన కల్పించారు.
యువత సైబర్ నేరాలు అరికట్టేందుకు కలిసికట్టుగా పోరాడాలని ఐఐసీ ప్రశాంత భూపతి సూచించారు. ఆన్‌లైన్ మోసాలు, డిజిటల్ సురక్షా, మత్తు పదార్థాలు నివారణపై అవగాహన కల్పించారు.


