జయపురంలో జేజే చలన చిత్రం ప్రదర్శన | - | Sakshi
Sakshi News home page

జయపురంలో జేజే చలన చిత్రం ప్రదర్శన

Nov 27 2026 2:44 AM | Updated on Nov 27 2026 2:44 AM

జయపురం: జయపురంలోని ఒక మినీ థియేటర్‌లో గురువారం జేజే చలన చిత్రం ప్రదర్శించారు. ఈ చిత్రంలో తాత, మనుమరాలి మధ్య ఉన్న స్వచ్ఛమైన ఆప్యాయతను చూపించారని ప్రేక్షకులు ప్రశంసించారు. కుటుంబ కథతో ప్రేక్షకులను ఆకట్టుకున్న ఈ చిత్రాన్ని జయపురం ఒడియ మీడియా ఫిల్మ్‌ సంస్థ నిర్మించింది.

ఈ చిత్రంలో జేజేగా రవి ప్రసాద్‌ పాత్రో, మనుమరాలు కిరన్‌ పాత్రలో బాల నటి నిహారిక జెనల సహజ నటన అబ్బురపరిచింది. చిత్రంలో గోపాల సామంతరాయ్‌, అమర మిశ్ర, విశాల పట్నాయిక్‌, సంతోష్‌ దాస్‌, నిరంజన పాణిగ్రహి, జీతు మిశ్ర, లాలు మిశ్ర, మనోజ్‌ పాత్రో, విష్టు పాత్రో వంటి ప్రముఖ నటులు తమతమ పాత్రలకు జీవం పోశారు. ఈ చిత్రాన్ని 2027 జనవరి 22వ తేదీన యూట్యూబ్‌లో అప్‌లోడ్‌ చేస్తామని దర్శకుడు, కథా రచయిత అయినటువంటి బబులు హీరో వెల్లడించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement