జనరల్‌ ఏజెంట్‌ను హౌస్‌ అరెస్ట్‌ చేయడం అప్రజాస్వామికం | - | Sakshi
Sakshi News home page

జనరల్‌ ఏజెంట్‌ను హౌస్‌ అరెస్ట్‌ చేయడం అప్రజాస్వామికం

Nov 27 2026 2:44 AM | Updated on Nov 27 2026 2:44 AM

గోకర్నపల్లిలో ఉద్రిక్తత

నరసన్నపేట: రాజ్యాంగబద్ధంగా పురపాలక ఎన్నికల్లో జనరల్‌ ఏజెంట్‌గా ఆర్‌ఓ ఒక వ్యక్తిని నియమిస్తే ఆయనను పోలీసులు హౌస్‌ అరెస్టు చేయడం అప్రజాస్వామికమని, రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికలు ఎలా జరుగుతున్నాయో ఇదే నిదర్శనమని మాజీ డిప్యూటీ సీఎం, వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ జిల్లా అధ్యక్షుడు ధర్మాన కృష్ణదాస్‌ అన్నారు. శ్రీకాకుళం పురపాలక ఎన్నికల్లో వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ అభ్యర్థి గుండ లక్ష్మీదేవికి జనరల్‌ ఏజెంట్‌గా మాజీ మంత్రి, సీనియర్‌ రాజకీయ నాయకులు ధర్మాన ప్రసాదరావు నియమితులు కాగా.. ఆయనను తిరగకుండా పోలీసులు హౌస్‌ అరెస్టు చేయడం దారుణమన్నారు. జిల్లా పోలీసు యంత్రాంగం తీరుపై ఆయన ఓ ప్రకటనలో తీవ్రంగా ధ్వజమెత్తారు. ఉదయానికే ఇంటి వద్దకు చేరుకున్న పోలీసులు ధర్మాన ప్రసాదరావును నిలువరించడం శోచనీయమన్నారు. రాష్ట్రంలో ప్రజాస్వామ్యం ఖూనీ అయ్యిందని అధికారులు, పోలీసులు పక్ష పాత పనితీరు సరైంది కాదన్నారు. పరిషత్‌ ఎన్నికల్లో శ్రీకాకుళం ఎమ్మెల్యే స్వగ్రామంలో ఘోరంగా ఓటమి చెందితే అధికారాన్ని అడ్డుపెట్టుకొని ఫలితాలను మార్చి అక్రమంగా గెలిచినట్లు ప్రకటించుకున్నారని అన్నారు. ఇలాంటి చర్యలు ప్రజాస్వామ్యానికి పెను ప్రమాదమని ఆవేదన వ్యక్తం చేశారు.

పొందూరు: మండలంలోని గోకర్నపల్లి గ్రామంలో పంచాయతీ ఎన్నికల ప్రచారంలో గురువారం రాత్రి ఉద్రిక్త వాతావరణం నెలకొంది. వైఎస్సార్‌సీపీ వర్గీయులు గ్రామంలో ప్రచారం చేస్తుండగా టీడీపీకి చెందిన పలువురు అకారణంగా, అకస్మాత్తుగా రాళ్లను విసిరి భయభ్రాంతులకు గురి చేశారు. దీంతో ఇద్దరికి స్వల్ప గాయాలయ్యాయి. వైఎస్సార్‌సీపీకి చెందిన పొన్నాడ భాస్కరరావు, ఎన్ని చిన్నారావులకు స్వల్పంగా గాయాలయ్యాయని గ్రామస్తులు తెలిపారు. గ్రామంలో ఉద్రిక్త వాతావరణం నెలకొంటుందని తెలిసిన కొద్ది సేపటిలోనే పోలీసు బలగాలు గ్రామానికి చేరుకున్నాయి. ఇరువర్గాలను చెదరగొట్టారు. గ్రామంలో పెద్ద ఎత్తున పోలీసు బలగాలు మోహరించారు. గ్రామంలో పరిస్థితిని డీఎస్సీ సీహెచ్‌ ధనుంజయనాయుడు పర్యవేక్షిస్తున్నారు. ఆయనతో పాటు సీఐ సన్యాసినాయుడు, ఎస్‌ఐ రాజేష్‌ ఉన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement