ఎంపీటీసెట్‌లో అనిల్‌కు ఫస్ట్‌ర్యాంక్‌ | - | Sakshi
Sakshi News home page

ఎంపీటీసెట్‌లో అనిల్‌కు ఫస్ట్‌ర్యాంక్‌

Nov 27 2026 2:44 AM | Updated on Nov 27 2026 2:44 AM

శ్రీకాకుళం: విజయవాడలోని డాక్టర్‌ ఎన్టీఆర్‌ ఆరోగ్య విశ్వవిద్యాలయం నిర్వహించిన మా స్టర్‌ ఇన్‌ థెరపీ కామన్‌ ఎంట్రన్స్‌ టెస్ట్‌(ఎంపీటీసెట్‌) 2026–27 ఫలితాల్లో గార మండలం జల్లువలస గ్రామానికి చెందిన బడగల అనిల్‌కుమార్‌ 100 మార్కులకు 86 మార్కులు సాధించి మొదటి ర్యాంకు కై వసం చేసుకున్నాడు. తన విజయానికి తల్లిదండ్రులు బడగల భాస్కరరావు, అనసూర్య ప్రోత్సాహం, ఉపాధ్యాయుల మార్గదర్శకత్వమే కారణమని అనిల్‌కుమార్‌ తెలిపారు.

ఎంపీడీఓ కార్యాలయంలో పోస్టల్‌ బ్యాలెట్‌

ఎచ్చెర్ల : మండల పరిషత్‌ కార్యాలయంలో గురువారం పోస్టల్‌ బ్యాలెట్‌ ప్రక్రియ నిర్వహించారు. 54 మంది పోస్టల్‌ బ్యాలెట్‌ ద్వారా తమ ఓటు హక్కు వినియోగించుకున్నారని ఎంపీడీవో హరిహరరావు తెలిపారు.

29న కవేరా పురస్కార ప్రదానం

శ్రీకాకుళం కల్చరల్‌ : నగరంలోని బాపూజీ కళామందిర్‌లో శ్రీవేణ్‌ ఫౌండేషన్‌ ఆధ్వర్యంలో కణుగుల వెంకటరావు 96వ జయంతి సందర్భంగా ‘కవేరా’ పురస్కార ప్రదానోత్సవం ఈ నెల 29న నిర్వహిస్తున్నట్లు నిర్వాహక అధ్యక్షుడు డాక్టర్‌ కె.సుధీర్‌ ఒక ప్రకటనలో తెలిపారు. సంఘ సేవకుడు, రెడ్‌క్రాస్‌ ద్వారా విశిష్ట సేవలందిస్తున్న పోలుమహంతి జగన్మోహనరావుకు ఈ పురస్కారం అందజేస్తున్నట్లు పేర్కొన్నారు.

ముందుగా పి.భారతీ రమేష్‌ బృందం భక్తి గానలహరి జరుగుతుందని, అనంతరం మనస్వరం–యువగళం పేరిట హైదరాబాద్‌కు చెందిన రావి భారతి కర్నాటక సంగీత గాత్ర కచేరి ఉంటుందని తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement