వార్డు మెంబర్‌పై టీడీపీ కార్యకర్త దాడి | - | Sakshi
Sakshi News home page

వార్డు మెంబర్‌పై టీడీపీ కార్యకర్త దాడి

Nov 27 2026 2:44 AM | Updated on Nov 27 2026 2:44 AM

నందిగాం: శివరాంపురం పంచాయతీ రెండో వార్డు మెంబర్‌గా పోటీ చేసిన కొర్రాయి అప్పయ్యపై తెలుగుదేశం కార్యకర్త దాడి చేశారు. బాధితుడు తెలిపిన వివరాల ప్రకారం.. అప్పయ్య ఇది వరకు తెలుగుదేశం పార్టీ కార్యకర్తగా ఉండేవారు. కానీ ఇటీవల జరిగిన ఎన్నికల తీరుతో ఆ పార్టీని వీడి వైఎస్సార్‌ సీపీ మద్దతుదారునిగా రెండో వార్డు మెంబరుగా నామినేషన్‌ వేశారు.

అయితే ఇతనికి పోటీగా ఎవరూ నామినేషన్‌ వేయకపోవడంతో ఆ వార్డు ఏకగ్రీవమైంది. దీంతో గురువారం ఆయనపై ఓ వ్యక్తి ధాన్యం నూర్పే బల్లతో దాడి చేయగా గాయమైంది. వెంటనే ఆయనను టెక్కలి జిల్లా కేంద్రాస్పత్రికి తరలించారు. విషయం తెలుసుకున్న వైఎస్సార్‌సీపీ టెక్కలి నియోజకవర్గ సమన్వయకర్త పేరాడ తిలక్‌ ఆస్పత్రికి చేరుకొని, దాడి జరిగిన వివరాలు అడిగి తెలుసుకున్నారు. అనంతరం తిలక్‌ మాట్లాడుతూ మంత్రి అచ్చెన్నాయుడు సర్పంచ్‌ పదవుల కోసం అధికార దుర్వినియోగం చేస్తూ టెక్కలి నియోజక వర్గంలో అరాచకం సృష్టిస్తున్నారని అన్నారు. టెక్కలి నియోజకవర్గంలో నిజంగా అభివృద్ధి చేసి ఉంటే ప్రజలే ఓట్లు గెలిపిస్తారు కదా.. ఈ దౌర్జన్యాలు ఎందుకు అని ప్రశ్నించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement