ఘనంగా కార్తికేయ మహోత్సవాలు | - | Sakshi
Sakshi News home page

ఘనంగా కార్తికేయ మహోత్సవాలు

Nov 26 2026 1:35 AM | Updated on Nov 26 2026 1:35 AM

● జయపూర్‌ ఎమ్మెల్యే బాహిణీపతి

పర్లాకిమిడి : స్థానిక పెద్దబ్రాహ్మణ వీధిలో కార్తికేయ మహోత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. పవిత్ర కార్తీకమాసంలో 29 ఏళ్లుగా ఈ ఉత్సవాలు నిర్వహిస్తున్నట్లు కమిటీ అధ్యక్షుడు నరేష్‌ పాత్రో తెలిపారు. ఆరు రోజుల పాటు జరిగే ఈ ఉత్సవాల సందర్భంగా పలు సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించనున్నట్టు కమిటీ అధ్యక్షుడు పాత్రో తెలిపారు.

సంప్రదాయబద్ధంగా బోయితో బోందోనోత్సవం

పర్లాకిమిడి: ఒడిశా సంస్కృతి, చరిత్రకు ప్రతీకగా నిర్విహించే బోయితో బోందోనో ఉత్సవాన్ని ప్రజలు సంప్రదాయబద్ధంగా మంగళవారం జరుపుకున్నారు. ఈ సందర్భంగా వంశధార నది వద్ద సరా గ్రామస్తులతో కలిసి స్థానిక ఎమ్మెల్యే రూపేష్‌ పాణిగ్రాహి వేడుకల్లో పాల్గొన్నారు. కాశీనగర్‌ బ్లాక్‌ సరా గ్రామం వంశధార వద్ద గ్రామస్తులతో ముచ్చటించిన ఎమ్మెల్యే రూపేష్‌ పడవలను నదిలో విడిచిపెట్టి పూజలు చేశారు. కార్యక్రమంలో జిల్లా పరిషత్‌ చైర్మన్‌ గవర తిరుపతిరావు, కాశీనగర్‌ బ్లాక్‌ అధ్యక్షురాలు బల్ల శాయమ్మ ఉన్నారు.

కొఠియాపై చర్చ జరగకపోతే ఆత్మహత్య చేసుకుంటా

హెచ్చరిక

కొరాపుట్‌ : కొఠియాపై అసెంబ్లీలో ప్రత్యేక చర్చ జరగకపోతే ఆత్మహత్య చేసుకుంటానని కాంగ్రెస్‌ పార్టీకి చెందిన జయపూర్‌ ఎమ్మెల్యే తారాప్రసాద్‌ బాహిణీపతి మరోసారి హెచ్చరించారు. బుధవారం రాష్ట్ర అసెంబ్లీలో, బయట ఇదే విధంగా ప్రకటనలు చేశారు. కొరాపుట్‌ జిల్లా పొట్టంగి సమితి కొఠియాపై ఆంధ్రప్రదేశ్‌ ఆక్రమణను తీవ్రంగా దుయ్యబట్టారు. ఈ సమస్యపై ప్రస్తుత బీజేపీ ప్రభుత్వం మొద్దునిద్ర వదలాలని సూచించారు. వెంటనే అసెంబ్లీలో ప్రత్యేక చర్చ చేపట్టాలని సూచించారు. ఈ విషయమై ముఖ్యమంత్రి ఎందుకు చర్చకు దూరంగా ఉంటున్నారో సమాధానం ఇవ్వాలని డిమాండ్‌ చేశారు. చర్చ జరగకపోతే అసెంబ్లీ పరిసర ప్రాంతాల్లో ఆత్మహత్య చేసుకుంటానని తుది హెచ్చరిక చేశారు. కొఠియా ఎల్లప్పుడూ ఒడిశాలోనే అంతర్భాగమని స్పష్టం చేశారు. ఇప్పటికే కొఠియాలో కొందరు రానున్న డిసెంబర్‌ 2న జరిగే ఆంధ్రప్రదేశ్‌ పంచాయతీ ఎన్నికలలో పాల్గొంటున్నారని గుర్తు చేశారు.

మేకలను అమ్మేందుకు వెళ్తూ..

రాయగడ : మేకలను విక్రయించేందుకు సంతకు వెళ్తున్న ఓ వ్యక్తి మార్గమధ్యలోనే అకస్మాత్తుగా కుప్పకూలి మృతి చెందాడు. ఈ ఘటన జిల్లాలోని కాసీపూర్‌ సమితి ఆమామాఝి– శిఖరపాయి రహదారిపై చోటు చేసుకుంది. కల్యాణసింగుపూర్‌ ప్రాంతంలో శురి గ్రామ పంచాయతీ రాంచేపాణి గ్రామానికి చెందిన కన్హు మాఝి(54) బుధవారం మేకలను విక్రయించేందుకు సంతకు కాలినడకన బయలుదేరాడు. మార్గమధ్యలో ఛాతిలో నొప్పిరావడంతో కుప్పకూలిపోయాడు. అతనితొ పాటు వచ్చిన సహచరుడు వెంటనే సపర్యలు చేసినా ఫలితం లేకపోయింది. అప్పటికే కన్హు మాఝి (54) మృతి చెందాడు. విషయం తెలుసుకున్న కుటుంబ సభ్యులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. అనంతరం పోలీసులకు సమాచారం అందించారు. పోస్టుమార్టం నిర్వహించిన అనంతరం కుటుంబ సభ్యులకు మృతదేహాన్ని అప్పగించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement