తైవాన్‌–భారత్‌ సదస్సుకు విక్రమదేవ్‌ వర్సిటీ వీసీ హాజరు | - | Sakshi
Sakshi News home page

తైవాన్‌–భారత్‌ సదస్సుకు విక్రమదేవ్‌ వర్సిటీ వీసీ హాజరు

Nov 26 2026 1:35 AM | Updated on Nov 26 2026 1:35 AM

జయపురం: జయపురం విక్రమదేవ్‌ విశ్వవిద్యాలయ వైస్‌ చాన్సలర్‌ ప్రొఫెసర్‌ హృషికేష్‌ శనాపతి తైవాన్‌ దేశం తిపాణీలో నిర్వహించిన తైవాన్‌– భారత సంయుక్త సమావేశంలో పాల్గొన్నారు. తైవాన్‌లో ఈ నెల 17 నుంచి 20వ తేదీ వరకు నిర్వహించిన సంయుక్త సదస్సులో జయపురం విక్రమదేవ్‌ విశ్వవిద్యాలయం, ఒపిశా రాష్ట్రంలో విద్యారంగానికి అంతర్జాతీయ స్థాయిలో అవగాహన, పేరు ప్రఖ్యాతులు తెచ్చేందుకు వీసీ పర్యటన దోహద పడిందిని వర్సిటీ బుధవారం విడుదల చేసిన పత్రికా ప్రకటనలో వెల్లడించారు. ఇంటిగ్రేటింగ్‌ స్టీమ్‌ ఆండ్‌ సోషియల్‌ సైన్సస్‌ అనే అంశంపై నిర్వహించిన అంతర్జాతీయ సదస్సులో బహుళ విభాగ విద్య, విజ్ఞాన శాస్త్రం, సాంకేతికత, కళలు, గణితం, సామాజిక శాస్త్రాల సమన్వయంపై శనాపతి ప్రసంగించారు. సదస్సు ప్రధమ సదస్సులో ఏఐ, డిజిటల్‌ టెక్నాలజీ, లెర్నింగ్‌ ఎన్విరోన్‌మెంట్స్‌, టీచర్‌ ప్రొఫెసనల్‌ డవలపమెంట్‌, అండ్‌ అసెసమెంట్‌ రిఫార్మస్‌ ఇన్‌ ఇండియన్‌ స్కూల్స్‌’అన్న అంశంపై ప్రొఫెసర్‌ హృషికేష్‌ శనాపితి ప్రసంగించారు. ఆయన తన ప్రసంగంలో భారతీయ పాఠశాలల విద్యా వ్యవస్థలో ఉపాధ్యాయుల వృత్తిపరమైన అభివృద్ధి, మూల్యాంకన విదానంలో సంస్కరణల గురించి ప్రస్తావించినట్టు వర్సిటీ వర్గాలు వెల్లడించాయి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement