ప్రమాదం సృష్టించి.. పెద్ద మొత్తంలో దోచేసి.. | - | Sakshi
Sakshi News home page

ప్రమాదం సృష్టించి.. పెద్ద మొత్తంలో దోచేసి..

Oct 15 2026 8:18 AM | Updated on Oct 15 2026 8:18 AM

● బెదిరించి నగదు బదిలీ చేయించిన ఇద్దరు అరెస్ట్‌

కాశీబుగ్గ : రోడ్డు ప్రమాదంగా సృష్టిస్తారు.. ఆపై తప్పునీదే అంటూ బెదిరిస్తారు.. వినకపోతే దాడి చేస్తారు.. చివరికి బలవంతంగా ఆన్‌లైన్‌లో నగదు బదిలీ చేయించుకుంటారు.. చెడు వ్యసనాలకు బానిసలై , అడ్డదారులు తొక్కుతూ అడ్డంగా దొరికిపోయిన ఇద్దరు దొంగమిత్రుల వైనాన్ని కాశీబుగ్గ పోలీసులు ఛేదించారు. వారిద్దరినీ బుధవారం అరెస్ట్‌ చేశారు. నిందితుల నుంచి ఆటో, ద్విచక్ర వాహనం, మూడు స్మార్ట్‌ ఫోన్లు, రూ.18,550 నగదు స్వాధీనం చేసుకున్నారు. కాశీబుగ్గ డీఎస్పీ జి.వి.రమణ బుధవారం విలేకరులకు వివరాలు వెల్లడించారు.

బెదిరించి రూ.88,500 బదిలీ..

ఈ నెల 11వ తేదీ తెల్లవారుజామున 3.15 గంటల సమయంలో పలాస మండలం రామకృష్ణాపురం సమీపంలోని జాతీయ రహదారిపై ఇచ్ఛాపురం నుంచి శ్రీకాకుళం వైపు ఓ వ్యక్తి ద్విచక్ర వాహనంపై వెళున్నాడు. ఇంతలో ఓ ఆటో అతడిని ఢీకొట్టింది. అనంతరం ఆ ఆటోలోని వ్యక్తులు అతడిపై దాడి చేసి, సెల్‌ఫోన్‌తో పాటు ద్విచక్ర వాహనాన్ని లాక్కున్నారు. అనంతరం బాధితుడిని బెదిరించి, ఫోన్‌ పే నుంచి ఓ నిందితుడి ఖాతాకు రూ.80,000, మరో నిందితుడి ఖాతాకు రూ.8,550 బదిలీ చేయించుకున్నారు. ఈ ఘటనపై బాధితుడి ఫిర్యాదు మేరకు పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ఇందులో భాగంగా ఈ నెల 13న నిందితులను పురుషోత్తపురంలో పోలీసులు పట్టుకుని అరెస్టు చేశారు. వీరిలో ఒకరిని పురుషోత్తపురానికి చెందిన కె.సాయికృష్ణ, కొత్తవూరుకు చెందిన గొర్లె రవితేజగా గుర్తించారు. చెడు వ్యసనాలకు బానిసలై నేరానికి పాల్పడినట్లు ప్రాథమిక దర్యాప్తులో వెల్లడైందని పోలీసులు తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement